ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

దేశంలో కరోనావైరస్ వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వాహన సంబంధిత రికార్డుల చెల్లుబాటు వ్యవధిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ ఈ పొడిగింపు వ్యవధిలో వెహికల్ ఇన్సూరెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి), ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మరియు ఎమిషన్ సర్టిఫికెట్ యొక్క చెల్లుబాటు వ్యవధి మాత్రమే పొడిగించబడింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

దీనిపై స్పందిస్తూ, ఇన్సూరెన్స్ బోర్డు ఆగస్టు 24 న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఆటో ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో అప్‌డేట్ చేయడం అవసరమని తెలిపింది. దీనికి కారణం వారి అక్రిడిటేషన్ వ్యవధి పొడిగించబడలేదు.

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

ఆటో ఇన్సూరెన్స్ పాలసీ యొక్క చెల్లుబాటు వ్యవధిని పొడిగించలేదని ఇన్సూరెన్స్ బోర్డు స్పష్టం చేసిన తరువాత మోటారు వాహన పాలసీదారులు తమ ఆటో బీమా పాలసీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. వాహనదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను పునరుద్ధరణ చివరి తేదీన లేదా అంతకు ముందే పునరుద్ధరించాలని ఇన్సూరెన్స్ బోర్డు సూచించింది.

MOST READ:లాంగ్ ట్రిప్స్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి మరిచిపోకండి

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం 1988 ను సవరించింది. సవరణ ప్రకారం వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఇన్సూరెన్స్ మరియు వాహనానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ తీసుకెళ్లవలసిన అవసరం లేదు. కొత్త నిబంధన ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ధృవీకరణ కోసం రికార్డులు అడిగినప్పుడు, సంబంధిత పత్రాలను డిజిటల్‌గా చూపించవచ్చు.

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

డిజిలాకర్ లేదా ఎం-ట్రాన్స్‌పోర్ట్ మొబైల్ యాప్‌లో రికార్డులు తనిఖీ చేసిన తర్వాత పోలీసులు వాహనదారుల నుండి డాక్యుమెంట్స్ చూపించమని అడగరు. ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేసింది.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

అంతే కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు జిపిఎస్ మరియు గూగుల్ మ్యాప్స్ కోసం మొబైల్ ఫోన్‌లను ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనదారులు తమ నావిగేషన్ కోసం మొబైల్ ఉపయోగించినట్లైతే ఈ చట్టం ప్రకారం జరిమానా విధించాల్సిన అవసరం లేదు.

ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

మొబైల్ ఫోన్లలో జీపీఎస్ వాడే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డ్రైవింగ్ చేసేటప్పుడు జిపిఎస్ కోసం మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్త చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. అంతే కాకుండా డాక్యుమెంట్స్ డిజిటలైజ్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్, దీనిని ఉపయోగిస్తే మీ డాక్యుమెట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు.

MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా

Most Read Articles

English summary
Insurance council clarifies about extension of vehicle insurance policy. Read in Telugu.
Story first published: Thursday, October 29, 2020, 13:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X