బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

భారత మార్కెట్లో బిఎస్-6 జావా మోటార్ సైకిల్స్ అప్డేట్ చేసిన ధరలను ప్రకటించింది. 2020 ఏప్రిల్ 1 నాటికి భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జావా మోటార్ సైకిల్స్ బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారుచేయబడ్డాయి. బిఎస్-6 జావా మోటార్ సైకిల్స్ గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం .. !

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

మార్కెట్లో విడుదలైన జావా మరియు జావా 42 బైక్స్ రెండింది మీద ఇప్పుడు దాదాపు రూ. 9,928 వరకు పెరుగుదల కనిపిస్తుంది. స్టాండర్డ్ జావా బిఎస్-6 మోడల్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 1.73 లక్షలు. సింగల్ ఛానల్ ఎబిఎస్ మోడల్స్ ధర 1.64 లక్షలు. కానీ డ్యూయెల్ ఛానల్ ఎబిఎస్ అమర్చిన బిఎస్ 6 జావా ధరలు కూడా రూ. 1.73 లక్షల నుంచి రూ .1.83 లక్షలకు పెరిగాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

అదేవిధంగా బిఎస్-6 జావా 42 బైక్ సింగిల్-ఛానల్ ఎబిఎస్ వెర్షన్ ధర ఇప్పుడు రూ. 1.55 లక్షల నుంచి 1.60 లక్షల వరకు ఉంటాయి. కానీ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ల ధర కూడా రూ. 1.64 లక్షల నుంచి రూ. 1.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) పెరిగాయి.

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

బిఎస్ 6 జావా మరియు జావా 42 మోడళ్లు ఒకే 293 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. అప్‌డేట్ చేసిన బిఎస్ 6-కంప్లైంట్ వెర్షన్లు అదే ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడి ఉంటాయి. ఇది 27 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

జావా బ్రాండ యొక్క మూడవ లేటెస్ట్ ఉత్పత్తి జావా పెరాక్. జావా పెరాక్ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అదేవిధంగా డెలివరీలు 2020 ఏప్రిల్ 2 నుండి ప్రారంభమవుతాయి.

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

జావా పెరాక్ 334 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 30 బిహెచ్‌పి మరియు 31 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ జావా పెరాక్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.94 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ జావా పెరాక్ బైక్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బిఎస్ 6 జావా మోటార్ సైకిల్స్ : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్-6 జావా మరియు జావా 42 మోటార్‌సైకిళ్లను నవంబర్ 2018 లో తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. రెండు మోటార్‌సైకిళ్లు ప్రారంభంలో చాలా మంచి డిమాండ్ ను కూడా కలిగి ఉన్నాయి. రెండు మోటార్ సైకిళ్ళు భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మరియు బుల్లెట్ 350 లకు ప్రత్యర్థిగా ఉంటుంది. జావా బైక్స్ తిరిగి ఇండియాలో రాజా సింహాల్లా తిరగనున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 2, 2020, 14:23 [IST]
English summary
Jawa & Jawa Forty Two BS6 Motorcycles Launched In India: New Prices Start At Rs 1.60 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+