Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!
చాలా ఏళ్ల తర్వాత భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త బిఎస్6 వెర్షన్ బైక్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బిఎస్6 వెర్షన్ జావా మరియు జావా ఫోర్టీ-టూ మోడళ్లను కంపెనీ డీలర్‌షిప్‌లకు సరఫరా చేస్తోంది.

జావా మోటార్‌సైకిల్ బ్రాండ్ తమ బిఎస్-6 వెర్షన్ జావా మరియు జావా ఫోర్టీ-టూ మోడళ్లను కంపెనీ మార్చ్ 2020లో లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందే మార్కెట్లో విడుదల చేసింది. వాస్తవానికి ఇప్పటికే ఈ రెండు మోడళ్ల డెలివరీలు ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 పాండెమిక్ కారణంగా ఆలస్యమైంది.

జావా మరియు జావా ఫోర్టీ-టూ రెండు మోడళ్లు కూడా రెండు విభిన్నమైన వేరియంట్లలో లభిస్తాయి. అందులో ప్రతీది కూడా సింగిల్-ఛానెల్ ఏబిఎస్ లేదా డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో వస్తాయి.
MOST READ: సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

బిఎస్6 వెర్షన్ సింగిల్-ఛానెల్ ఏబిఎస్ వేరియంట్స్ అయిన జావా ఫోర్టీ-టూ ధర రూ.1.60 లక్షలు మరియు జావా క్లాసిక్ ధర రూ.1.73 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఇకపోతే బిఎస్6 వెర్షన్ డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ వేరియంట్స్ అయిన జావా ఫోర్టీ-టూ ధర రూ.1.69 లక్షలు మరియు జావా క్లాసిక్ ధర రూ.1.82 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
MOST READ: మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

వేరియంట్ల వారీగా లభించే జావా మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి (జూన్ 2020 నాటికి):
Version | Single-channel ABS | Dual-channel ABS |
Jawa Forty-Two | ||
Halley's Teal | R1,60,300 | R1,69,242 |
Starlight Blue | R1,60,300 | R1,69,242 |
Lumos Lime | R1,64,164 | R1,73,106 |
Comet Red | R1,65,228 | R1,74,170 |
Galactic Green | R1,65,228 | R1,74,170 |
Nebula Blue | R1,65,228 | R1,74,170 |
Jawa Classic | ||
Black | R1,73,164 | R1,82,106 |
Grey | R1,73,164 | R1,82,106 |
Maroon | R1,74,228 | R1,83,170 |

వాస్తవానికి జావా బిఎస్6 మోడళ్లు మార్చ్ 2020లోనే విడుదలైనప్పటికీ, ఆ తర్వాత వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం, అది కాస్తా రెండు నెలల వరకూ నిరంతరాయంగా పొడగించబడటం వంటి కారణాల దృష్ట్యా కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన మే నెలలో ప్రభుత్వం ఆటోమొబైల్ కంపెనీలను లాక్డౌన్ నుంచి మినహాయించడంతో జావా తమ వ్యాపార కార్యకలాపాలను, ఈ రెండు మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఈ షట్‌డౌన్ కారణంగా గడచిన మార్చ్ నెలలో జావా మోటార్‌సైకిళ్లను బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఇంకా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పుడు జావా మోటార్‌సైకిళ్ల ప్రొడక్షన్, సేల్స్ అండ్ సర్వీస్ రీస్టార్ట్ కావటంతో మరికొద్ది రోజుల్లో ఈ బిఎస్6 మోడళ్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఇండియన్ మార్కెట్ కోసం జావా తయారు చేసిన మోటార్‌సైకిళ్లలో పవర్ఫుల్ బిఎస్-6 ఇంజన్లను ఉపయోగించారు. ఈ 293సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 26.2 బిహెచ్‌పిల శక్తిని, 27 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
జావా మోటార్‌సైకిల్ బ్రాండ్‌కి ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో చాలా పాపులారిటీ ఉండేది. రీలాంచ్‌తో జావా బ్రాండ్ తిరిగి అదే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ జావా మోటార్‌సైకిళ్లు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కి డైరెక్ట్ పోటీ ఇవ్వనున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లో బజాజ్ డోమినార్ 250కి కూడా పోటీ ఇస్తుంది.