జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

ఇటీవల కాలంలో యువకులందరిని ఉర్రూతలూగిస్తున్న మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మరియు జావా బైక్స్. ఈ జావా బైక్‌ చాలామంది యొక్క కలల వాహనం. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మాత్రమే కాకుండా జావా బైక్ కూడా చాలామంది ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనం.

 

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా మాత్రం పరిమితంగానే జరుగుతూ ఉంది. సాధారణంగా తమకు ఇష్టమైన బైక్ కలిగి ఉన్నట్లయితే ఆ అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. మైసూర్ లో ఇలాంటి అనుభవమే ఒక మహిళకు కలిగింది. మైసూర్ కి చెందిన ఈ మహిళా తనకి ఇష్టమైన జావా 42 బైకుని డెలివరీ చేసుకుంది.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

ఈ జావా 42 బైక్ డెలివరీ పొందిన మహిళ పేరు నందిని. జావా బైకుని పొందిన ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దాని ప్రకారం, తాను గత జనవరి 7 న ఈ బైక్‌ను బుక్ చేసుకున్నట్లు చెప్పారు. అదే నెల 21 న ఈ బైక్ డెలివరీ చేయబడిందని తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

జావా బైకులు బుక్ చేసుకున్న తరువాత వాటి డెలివరీల కోసం కొన్ని నెలలు వేచి ఉండాలి. అప్డేట్ చేసిన జావా బైక్ చాలామంది వినియోగదారులు బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ బైకుల డెలివరీలో మాత్రం కొంత గందరగోళం నెలకొంది.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

జావా బైక్స్ బుక్ చేసుకున్న తరువాత చాల మంది బుకింగ్స్ రద్దు చేయబడ్డాయి. ఈ కారణంగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జావా మరియు జావా 42 బైక్‌ల ఉత్పత్తిని పెంచుతామని క్లాసిక్ లెజెండ్స్ ప్రకటించింది. ఈ విధంగా ఉత్పత్తిని పెంచడం వల్ల బుక్ చేసుకున్న అందరి వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

జావా బైక్ డెలివరీ ఇంత కష్టంగా ఉన్న తరుణంలో కూడా నందినికి చాలా తొందరా తాను బుక్ చేసుకున్న తన అభిమాన బైక్ డెలివరీ చేయబడింది. జావా 42 బైక్‌లు దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లతో పోటీపడుతున్నాయి. ఈ బైక్ జావా కంపెనీ ఎంట్రీ లెవల్ బైక్.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

జావా 42 బైక్‌లో 293 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 27 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ డ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. జావా బైక్‌లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. జావా కంపెనీ ప్రస్తుతం జావా మరియు జావా 42 బైక్‌లను విక్రయిస్తోంది.

అదనంగా బైక్ పెరాక్ గత సంవత్సరం చివరిలో లాంచ్ చేయబడింది. ఈ బైక్ ధర రూ. 1.94 లక్షలు. జావా పెరాక్ మోటార్ సైకిల్ పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు.

జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ

ఈ బైక్‌లో 334 సిసి, ఫోర్-స్ట్రోక్, ఫ్యూయల్ ఇంజెక్షన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 30 బిహెచ్‌పి పవర్ మరియు 31 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి మరియు ఏప్రిల్ నాటికి బైక్‌లు పంపిణీ చేయబడతాయి.

Image Courtesy: NaNdiNi/Instagram

Most Read Articles

English summary
Karnataka woman rider gets delivery of Jawa 42 dances with joy. Read in Telugu.
Story first published: Thursday, March 19, 2020, 13:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X