కవాసకి వినియోగదారులకు గుడ్ న్యూస్, ఏమిటో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వల్ల అన్ని దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్నాయి. భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ కారణంగా కవాసకి ఇండియా తన వినియోగదారులకు వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగించినట్లు ప్రకటించింది. 2020 మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు వారంటీ వ్యవధి ముగిసిన అన్ని మోటార్ సైకిళ్ళు పొడిగింపుకు అర్హత కలిగి ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

కవాసాకి కంపెనీ తమ కస్టమర్లకు వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ టైమ్ ని 2020 జూన్ 30 వరకు పొడిగించబడింది. ఇది కవాసకి వినియోగదారులకు చాలా ఉంపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ వ్యవధి కాలంలో ఫ్రీ సర్వీస్ ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

తమ వినియోగదారులకు అలాంటి ప్రయోజనాన్ని ప్రకటించిన ద్విచక్ర వాహనాల తయారీదారుల సుదీర్ఘ జాబితాలో కవాసకి కంపెనీ కూడా చేరింది. ఇప్పటికే బజాజ్, కెటిఎం, యమహా, టివిఎస్ మరియు హోండా వంటి సంస్థలు కూడా తమ వినియోగదారులకి ఫ్రీ సర్వీస్ ప్రకటించింది.

భారతదేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఇప్పుడు 2020 మే 3 వ తేదీ వరకు పొడిగించబడింది. ఇప్పటికే అన్ని వాహనాల తయారీ మరియు కార్యకలాపాలు మూసివేయబడ్డాయి. ఆటోమొబైల్ తయారీదారులు 25% సామర్థ్యంతో కార్యకలాపాలను ప్రారంభించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపింది.

కరోనా వైరస్ వల్ల అన్ని కార్య కలాపాలు నిలిచిపోవడంతో ప్రస్తుతం బిఎస్ 4 వాహనాలు కూడా ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. బిఎస్ 4 వాహన అమ్మకాలకు సుప్రీంకోర్టు ప్రారంభంలో 10 రోజుల వ్యవధిని కూడా పొడిగించింది. కానీ నిరవధిక లాక్ డౌన్ వల్ల ఆ వ్యవధి కూడా వాయిదా పడింది.

లాక్ డౌన్ కాలంలో కరోనా నియంత్రణలో భాగంగా చాలా ఆటో కంపెనీలు ప్రభుత్వానికి మద్దతుగా ఫేస్ షీల్డ్స్, ప్రొటెక్టివ్ గేర్, వెంటిలేటర్లు మరియు గ్లౌజులు వంటి వాటిని తయారు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి కఠినమైన పరిస్థితుల్లో ఆటో పరిశ్రమలు కూడా కరోనా నివారణలో తమ వంతు మద్దతును ప్రకటిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం..!
భారతదేశంలో చాలా కంపెనీలు తమ వాహన వినియోగదారులకు వారంటీని మరియు ఫ్రీ సర్వీస్ గడువును పెంచుతూ ప్రకటించాయి. ఇందులో మోటార్ సైకిల్స్ మరియు కార్ల తయారీదారులకు ఈ వారంటీ మరియు సర్వీస్ వర్తిస్తుంది. అంతే కాకుండా ఈ భయంకరమైన వైరస్ పై పోరాటానికి ఆటో పరిశ్రమలు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications








