త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కవాసకి తన బ్రాండ్ అయిన జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కవాసకి ఇటీవల తన జెడ్ఎక్స్ 25 ఆర్ బైక్ లాంచ్ ని కూడా వాయిదా వేసింది. క్వార్టర్ లీటర్ స్పోర్ట్స్ బైక్‌ను ఇండోనేషియాలో ఏప్రిల్ 4 న విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. కరోనా వైరస్ కారణంగా క్వార్టర్ లీటర్ స్పోర్ట్స్ బైక్ విడుదల కూడా వాయిదా పడింది.

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్ యొక్క ఇన్-లైన్ 4 సిలిండర్ ఇంజిన్ యొక్క సౌండ్ మరియు పవర్ చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ అప్సైడ్ డౌన్ గా ఉన్న ప్రత్యేక ఫంక్షన్ ఫోర్క్ ఉంది. ఈ బైక్ వెనుక భాగంలో బ్యాక్-లింక్ సస్పెన్షన్ ఉంది. ఈ బైక్ భద్రత కోసం ముందు మరియు వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్ లను కూడా కలిగి ఉంది.

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్‌లో 249 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇంజిన్ యొక్క బిహెచ్‌పి పవర్ మరియు టార్క్ గణాంకాలు గురించి ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఇంజిన్ 40 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

MOST READ:అప్‌డేట్ ఫీచర్స్ తో లాంచ్ కానున్న 2020 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ మరియు క్విక్‌షిఫ్టర్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ ట్విన్ పాడ్‌లో హెడ్‌ల్యాంప్, ఫుల్ ఫెయిరింగ్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో మజిల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ మరియు తక్కువ సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ ఉన్నాయి.

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చబడి ఉంది. ఇది అనలాగ్ టాకోమీటర్ మరియు సెమీ డిజిటల్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్‌లో ఎలక్ట్రానిక్ రైడర్ కూడా ఉంది. దీనికి డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.

MOST READ: విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్ భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత, హోండా సిబిఆర్ 250 ఆర్ఆర్ బైక్‌కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ రెండు బైక్‌లు పనితీరుతో బలమైన పోటీని అందిస్తాయి.

కరోసా వైరస్ అధికంగా విజృంభిస్తున్న కారణంగా కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్‌ను విడుదల వాయిదా పడింది. కానీ ఈ కొత్త బైక్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనుంది.

MOST READ: ఎ-క్లాస్ లిమోసిన్ కార్ వివరాలను వెల్లడించిన మెర్సిడెస్ బెంజ్

త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కొత్త కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో మంచి భద్రత లక్షణాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వినియోగదారులు కొత్త కవాసకి బైక్ కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Most Read Articles

English summary
Kawasaki Ninja ZX-25R hits the dyno. Read in Telugu.
Story first published: Tuesday, April 21, 2020, 13:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X