యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసాకి, భారత మార్కెట్లో తమ అధునాతన రెట్రో-క్లాసిక్ మోటార్‌సైకిల్ డబ్ల్యూ175ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కవాసకి నుండి ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌గా రానున్న కొత్త డబ్ల్యూ 175 రెట్రో-క్లాసిక్ క్రూయిజర్ వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కావచ్చని సమాచారం.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదిక ప్రకారం, కవాసకి భారత మార్కెట్లో తమ డబ్ల్యూ175 మోటార్‌సైకిల్‌ను స్థానికంగానే తయారు చేయాలని భావిస్తోంది. దాదాపు 90 శాతం ఉత్పత్తిని స్థానికీకరణ చేయాలని కవాసకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే, సరసమైన ధరకే ఈ మోడల్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

ఈ మోడల్ ఉత్పత్తిని స్థానికీకరణ చేయటం ద్వారా, కవాసకి భారత్ వంటి ప్రైస్-సెన్సిటివ్ మార్కెట్లలో ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌ను పోటీతత్వ ధరతో అందిచాలని భావిస్తోంది. భారత మార్కెట్లో కవాసాకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్ ధర రూ.1.5 లక్షల మార్క్‌లో ఉండొచ్చని అంచనా.

MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్‌లో 177సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 13 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న ఈ మోడల్‌లోని ఇంజన్‌లో విఎమ్24 కార్బ్యురేటర్‌ను ఉపయోగిస్తున్నారు. అఅయితే, భారత మార్కెట్లో కఠినతరమైన తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇందులో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది.

MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

కవాసాకి డబ్ల్యూ175 కొలతలను గమనిస్తే, ఇది 1930 మిమీ పొడవు, 765 మిమీ వెడల్పు, 1030 మిమీ ఎత్తు మరియు 1275 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి, 126 కిలోల కెర్బ్ వెయిట్‌ను కలిగి ఉంటుంది.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

ఈ రెట్రో మోటార్‌సైకిల్‌లో గుండ్రటి ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో ట్రెడిషనల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటుంది.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

ఈ మోటార్‌సైకిల్‌లో ఫ్లాట్ సీటుతో పాటు సరళమైన మరియు రైట్-అప్ రైడర్ ఎర్గోనామిక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో 13.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి రియర్ వ్యూ మిర్రర్స్ మరియు రెండు చివర్లలో 17 ఇంచ్ స్పోక్డ్ వీల్స్ ఉంటాయి.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఓల్డ్-స్కూల్ రబ్బర్ గైటర్లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన ట్రెడిషనల్ ట్విన్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయాన్ని గమనిస్తే, ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

అంతర్జాతీయ వెర్షన్ డబ్ల్యూ175 మోటార్‌సైకిల్ ఏ విధమైన ఏబిఎస్ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే, కవాసకి భారత మార్కెట్ కోసం కనీసం ఇందులో ముందు భాగంలోనైనా సింగిల్-ఛానెల్ ఏబిఎస్‌ను జోడించే అవకాశం ఉంది. దేశంలో తాజా భద్రతా నిబంధనలు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

కవాసాకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్‌ను సింగిల్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లలో లభ్యం కానుంది. ఈ మోటార్‌సైకిల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో స్క్రాంబ్లర్ మరియు కేఫ్-రేసర్ వెర్షన్‌లో కూడా అందిస్తున్నారు.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

కవాసకి డబ్ల్యూ175 మాదిరిగానే, యమహా కూడా ఎక్స్ఎస్ఆర్ 155 అని పిలువబడే ఎంట్రీ లెవల్ మోడ్రన్-క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. కవాసకి డబ్ల్యూ175 మాదిరిగానే, యమహా ఎక్స్ఎస్ఆర్ 155 కూడా వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి పోటీగా వస్తోన్న కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్

కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో మోడ్రన్-రెట్రో మోటార్‌సైకిళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఫలితంగా, ఈ విభాగంలో అనేక మంది తయారీదారులు భారత మార్కెట్లో సరసమైన ధరతో కొత్త ఎంట్రీ లెవల్ మోడళ్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కవాసకి నుండి రాబోయే డబ్ల్యూ175 కూడా ఈ విభాగంలో సందడి చేయటానికి వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది.

Most Read Articles

English summary
Kawasaki is expected to launch a new entry-level motorcycle from its modern-classic range in the Indian market. The company is expected to bring the W175 retro-classic cruiser sometime next year in the country. Read in Telugu.
Story first published: Saturday, October 10, 2020, 18:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X