కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

జపనీస్ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ కవాసాకి, భారత మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన తమ బిఎస్6 కవాసకి నిన్జా 650 మోటార్‌సైకిల్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. మే 2020లో లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందే ఈ మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ కవాసకి భారత విపణిలో విడుదల చేసింది. వాస్తవానికి ఇప్పటికే ఈ మోడల్ డెలివరీలు ప్రారంభం కావల్సి ఉండగా, కొనసాగుతున్న కోవిడ్-19 పరిస్థితుల కారణంగా జాప్యమైంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

భారత మార్కెట్లో కొత్త కవాసకి నిన్జా 650 బిఎస్6 ధర రూ.6.24 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. కొత్త (2020) కవాసకి నిన్జా 650 బిఎస్6 బైక్ దాని మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే అనేక సూక్ష్మ మార్పుల చేర్పులతో అప్‌గ్రేడ్ చేశారు. ఈ మార్పులతో కొత్త నిన్జా 650 మునుపటి కన్నా మరింత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

ఇందులో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త 2020 కవాసాకి నిన్జా 650 బిఎస్6 రెండు కలర్ ఆప్షన్లలో (లైమ్ ఎబోనీ గ్రీన్, పెర్ల్ ఫ్లాట్ స్టార్‌డస్ట్ వైట్) లభిస్తుంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

కాస్మోటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా 2020 కవాసాకి నిన్జా 650 బిఎస్6 మోడల్‌లో అదనపు ఫీచర్లు మరియు ఎలక్ట్రానిక్స్‌ను కూడా జోడించారు.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

ఈ మోటార్‌సైకిల్ అదే 649 సిసి పారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్‌పి శక్తిని మరియు 6700 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

కవాసాకి నిన్జా 650 బిఎస్6 బైక్ దాని మునుపటి బిఎస్4 మోడల్ మాదిరిగానే అనేక రకాల విడిభాగాలు, కొలతలు మరియు ఇతర పరికరాలను ఉపయోగించుకుంటుంది. ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 196 కిలోలు మరియు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు. ఈ రెండింటిలో ఇది వరకటి మోడల్‌కు ప్రస్తుత మోడల్‌కు ఎలాంటి మార్పు లేదు.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇకపోతే భాగంలో ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది డ్యూయెల్ ఛానెల్ ఎబిఎస్‌ని సపోర్ట్ చేస్తుంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

ప్రభుత్వం ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో, ఈ మోటార్‌సైకిల్ కోసం బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా డీలర్‌షిప్‌లలో కానీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కవాసాకి నిన్జా 650 బిఎస్6 మోడల్‌ను భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఫలితంగా ఈ మోడల్‌ను అత్యంత పోటీ ధరతో కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

కవాసాకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కవాసాకి నిన్జా 650 మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మిడిల్-వెయిట్ సెగ్మెంట్ ఆఫర్లలో ఒకటిగా ఉంటుంది. నిన్జా 650 బిఎస్6 మోడల్‌కు ఈ సెగ్మెంట్లో హోండా సిబిఆర్ 650ఆర్ బిఎస్4 మోడల్ కాకుండా వేరే డైరెక్ట్ కాంపిటీటర్స్ ఎవరూ లేరు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 8, 2020, 12:37 [IST]
English summary
Kawasaki India has finally commenced deliveries of their 2020 Ninja 650 motorcycle in the Indian market. The middle-weight motorcycle offering from the Japanese brand was introduced in its BS6 guise back in May 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+