భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసాకి మోటార్‌సైకిల్స్, భారత్‌లో బిఎస్6 కాలుష్య నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత దేశీయ మార్కెట్ నుండి తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ నింజా 300 మోడల్‌ను ఆఫర్‌ను నిలిపివేసింది. కాగా, తాజాగా ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కవాసకి ఇప్పుడు తమ నింజా 300లో అప్‌డేట్ చేసిన బిఎస్6 వెర్షన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టనుంది.

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

ఈ నివేదికల ప్రకారం, కొత్త బిఎస్6 కంప్లైంట్ కవాసాకి నింజా 300 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని కవాసకి తమ నింజా 300 యొక్క కొత్త బిఎస్6 వెర్షన్‌ను ఈ విభాగంలో పోటీ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. బిఎస్4 కంటే బిఎస్6 ధర తక్కువగా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

కవాసకి మొట్టమొదటిసారిగా 2018లో నింజా 300 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌లో ఎక్కువ భాగాన్ని కంపెనీ స్థానికీకరించింది (లోకలైజేషన్). అంటే, దీని తయారీలో ఉపయోగించిన వివిధ బాడీ ప్యానెల్లు, బ్రేకులు, టైర్లు మరియు హెడ్‌లైట్లు మొదలైన విడిభాగాలను కంపెనీ భారత విక్రయదారుల నుండే కొనుగోలు చేసింది.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

కాగా, ఇప్పుడు కొత్త BS6 మోటారుసైకిల్ విషయంలో కంపెనీ మరో అడుగు ముందుకు వేసి ఇంజన్ అసెంబ్లీని కూడా స్థానికంగానే తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంపోర్టెడ్ ఇంజన్ కన్నా ఇంజన్‌ను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయటం ద్వారా ఈ మోటార్‌సైకిల్ ఉత్పాదక వ్యయం తగ్గి, సరసమైన ధరకే ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం కలుగుతుంది.

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

ఇక ఇందులో ఉపయోగించబోయే విషయానికి వస్తే, కవాసాకి నింజా 300లో 296సిసి పారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ యూనిట్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. బిఎస్ 6-కంప్లైంట్ ఇంజన్ 39 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

కవాసకి నింజా 300లోని మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 290 మిమీ మరియు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

ఈ మోటార్‌సైకిల్‌లో ముందు మరియు వెనుక వైపున వరుసగా 110/70 మరియు 140/70 ప్రొఫైళ్లతో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, వీటిపై ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అమర్చబడి ఉంటాయి. ఇది భారీ 17-లీటర్ ఇంధన ట్యాంక్, 795 మిమీ సీట్ ఎత్తు మరియు 179 కిలోల బరువును కలిగి ఉంటుంది.

MOST READ:చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

భారత్‌లో కవాసకి నింజా బిఎస్6 విడుదల ఎప్పుడంటే..

కొత్తగా రానున్న కవాసాకి నింజా 300 బిఎస్6 డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. దీని స్టైలింగ్ ఇదివరకటి మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు విడుదల సమయంలో తెలిసే అవకాశం ఉంది.

కవాసకి నింజా 300 బిఎస్6 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గతంలో దేశంలో లోకలైజ్ చేసిన బిఎస్4 కవాసాకి నింజా 300 మోటార్‌సైకిళ్లు భారత మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి పనితీరును కనబరిచాయి. ఈ నేపథ్యంలో కవాసాకి ఇప్పుడు మరింత ఎక్కువ లోకలైజ్ చేసిన బిఎస్6 నింజా 300ను మార్కెట్లో సరసమైన ధరకే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో టివిఎస్ అపాచీ ఆర్ఆర్310 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Kawasaki Motorcycles discontinued its entry-level Ninja 300 offering from its Indian lineup, this time last year. Now, Autocar India reports that the brand is all set to re-introduce the Ninja 300 in its updated BS6 avatar back into the Indian market very soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X