Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2021 కవాసకి నింజా 400 బైక్ భారత్‌లో లాంచ్ కానుందా ?
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసకి తన 2021 నింజా 400 సూపర్‌స్పోర్ట్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త కవాసాకి నింజా 400 బైక్ కొత్త కలర్ అప్సన్లలో ఆవిష్కరించబడింది. కొత్త కవాసకి నింజా బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త కవాసకి నింజా 400 బైక్ బ్లాక్, గ్రే, బ్లూ మరియు కెఆర్టి కలర్స్ లో విడుదల చేయబడింది. ఈ బైక్ కొత్త కలర్ ఆప్సన్స్ తప్ప వేరే ఇతర మార్పులు పొందలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ బైక్ యొక్క రూపకల్పన మరియు మెకానికల్ ఆస్పెక్ట్స్ లో ఎటువంటి మార్పులు లేవు.

బ్లాక్ కలర్ ఛాయిస్ కవాసకి నింజా 400 బైక్ సున్నితమైన వైట్ డెకాల్స్‌తో డ్యూయల్ టోన్ లుక్ ఇస్తుంది. ఈ బైక్‌లో అల్లాయ్ వీల్స్‌పై రెడ్ టేప్ కూడా ఉంది.
2021 కవాసకి నింజా 400 బైక్ కొద్దిగా రెట్రో స్టైల్ టీల్ బ్లూ గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఈ కొత్త గ్రే కలర్ ఆప్సన్ హోండా సిబిఆర్ 250 బైక్లో యొక్క కలర్ ఛాయిస్ లాగా కనిపిస్తుంది. కొత్త నింజా 400 బైక్ డెకాల్స్ కలిగి ఉంది.
MOST READ:త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

ఇప్పుడు ఈ బైక్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంది. ఈ బైక్ యొక్క పై భాగాలలో టర్కిష్ బ్లూ కలర్ ఫినిషింగ్ ఉంటుంది. ముందు భాగంలో కొన్ని భాగాలు బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇది డ్యూయల్ టోన్ లుక్ ఇస్తుంది.

మునుపటి బిఎస్-4 నింజా 400 మోడల్ ఎబోనీ బ్లాక్ మరియు లైమ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో భారతదేశంలో లభించింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం బిఎస్-4 నింజా 400 ధర రూ. 4.99 లక్షలు.
MOST READ:ఒక్క సారిగా సర్వీస్ సెంటర్లపై పడిన కార్ ఓనర్స్.. ఎందుకంటే ?

కొత్త నింజా 400 బైక్‌లో 398 సిసి పరేల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 47.5 బిహెచ్‌పి శక్తి మరియు 36 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

2021 నింజా 400 బైక్ సస్పెన్షన్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో యూని-ట్రాక్ మోనోషాక్ సెటప్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇక ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. దీనితో డ్యూయల్ ఎబిఎస్ స్టాండర్డ్‌గా అమర్చబడుతుంది.
MOST READ:ఇది చూసారా.. బామ్మకోసం 4 దేశాలు కాలినడకతో ప్రయాణించిన 10 ఏళ్ల బాలుడు

కవాసకి నింజా భారత మార్కెట్లో ఉత్తమ స్పోర్ట్స్ బైకులలో ఒకటి. కొత్త నింజా 400 బైక్ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ,మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త రంగులలో విడుదల కావడం వల్ల మరింతమంది ఎక్కువ వినియోగదారులను ఆకర్షించి అవకాశం ఉంటుంది.