Just In
- 19 min ago
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 3 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
Don't Miss
- News
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
- Sports
'కార్టూన్ బాయ్' రిషభ్ పంత్‌ను ట్రోల్ చేసిన రషీద్ ఖాన్!! ఏమన్నాడంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు... ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న తొలి మహిళా పైలట్ స్వాతి రాథో
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ సూపర్‌బైక్స్ ఆవిష్కరణ
జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసాకి అందిస్తున్న నింజా సిరీస్‌లో రెండూ కొత్త సూపర్‌బైక్‌లను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ మరియు నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ అనే రెండు సూపర్‌బైక్‌లలో 2021 వెర్షన్లను కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది.

కొత్త 2021 కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ మరియు జెడ్ఎక్స్-10ఆర్ఆర్ మోడళ్లు ఇప్పుడు కొత్త ఫీచర్లు, టెక్నాలజీ మరియు రైడింగ్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటుగా అప్డేట్ చేయబడిన ఇంజన్లతో రానున్నాయి. ఈ మార్పులతో ఇవి మునుపటి కన్నా మరింత ప్రీమియంగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

కవాసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ మరియు దాని రేస్-ఫోకస్డ్ వెర్షన్ జెడ్ఎక్స్-10ఆర్ఆర్ మోడళ్లు రెండూ కూడా ఇప్పుడు కొత్త ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. బ్రాండ్ యొక్క హెచ్2 మోడల్ నుండి ప్రేరణ పొంది దీనిని డిజైన్ చేశారు. ఇది మరింత ప్రముఖంగా మరియు అగ్రెసివ్ రూపాన్ని కలిగి ఉంటుంది.
MOST READ:లాంగ్ డిస్టెన్స్ ట్రయల్ రన్లో పాల్గొన్న ఎంజి జెడ్ఎస్ ఇవి ; వివరాలు

ఈ కొత్త సూపర్‌బైక్ ఇప్పుడు 40 మిమీ ఎత్తైన విండ్‌స్క్రీన్‌తో వస్తుంది, ఇది మంచి విజిబిలిటీని ఆఫర్ చేస్తుంది. కొత్త 2021 జెడ్ఎక్స్-10ఆర్‌లో కౌల్-ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్ కూడా ఉంటాయి, ఇవి మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే 17 శాతం మెరుగైన డౌన్‌ఫోర్స్‌ను ఆఫర్ చేస్తాయి.

ఫీచర్ల విషయానికొస్తే, 2021 కవాసాకి జెడ్ఎక్స్-10ఆర్ ఇప్పుడు ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్స్ మరియు మల్టిపుల్ రైడింగ్ ఎయిడ్స్‌తో నిండి ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఫుల్ కలర్ 4.3 ఇంచ్ టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు రైడింగ్ మోడ్లు (రెయిన్, రోడ్ & స్పోర్ట్), కార్నరింగ్ ఏబిఎస్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ మరియు ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సర్వే బోట్ : ఇంతకీ దీని ఉపయోగమేంటో మీకు తెలుసా ?

కొత్త 2021 కవాసాకి జెడ్ఎక్స్-10ఆర్ ముందు భాగంలో 43 మిమీ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇవి రెండూ డ్యాంపింగ్, రీబౌండ్ మరియు ప్రీలోడ్ పరంగా పూర్తి సర్దుబాటుతో సౌలభ్యంతో వస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 330 మిమీ డిస్కుల మరియు వెనుకవైపు ఒకే 220 మిమీ డిస్క్ ఉంటాయి. వీటిని బ్రెంబో నుండి గ్రహించారు.

ఇక రేస్-ఫోకస్డ్ 2021 కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ఆర్ విషయానికి వస్తే, ఇందులో రివైజ్ చేయబడిన కామ్ షాఫ్ట్‌లు, కొత్త ఇన్‌టేక్ మరియు టైటానియం కనెక్టెడ్ రాడ్లు ఉన్నాయి, ఇది అధిక రివ్-లిమిట్‌ను అందిస్తుంది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ కూడా మార్చెసిని బ్రాండ్ నుండి గ్రహించిన ఫోర్జ్డ్ వీల్స్‌తో వస్తుంది. వీటిపై పిరెల్లి డయాబ్లో సూపర్కోర్సా ఎస్పి టైర్లను అమర్చబడి ఉంటాయి.
MOST READ:క్రాష్ టెస్ట్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మహీంద్రా థార్ : వివరాలు

ఈ లీటర్-క్లాస్ మోటార్‌సైకిళ్ల యొక్క 2021 వెర్షన్లు అప్డేటెడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తాయి. కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ యూరో-5 కంప్లైంట్ 998సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200 బిహెచ్పి పవర్‌ను మరియు 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ క్విక్-షిఫ్టర్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

కొత్త 2021 కవాసాకి జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-10ఆర్ఆర్ మోడళ్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కొత్త 2021 కవాసాకి జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-10ఆర్ఆర్ రెండూ కూడా వచ్చే ఏడాది ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదలవుతాయని అంచనా. భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన తర్వాత, ఈ కొత్త కవాసాకి సూపర్ బైక్‌లు ఈ విభాగంలోని బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, డ్యుకాటి పానిగన్ వి4 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.
MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?