భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

జపనీస్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కవాసకి భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కొత్త 2020 కవాసాకి వెర్సిస్ బిఎస్6 మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ఈ సరికొత్త అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌ను 'క్యాండీ లైమ్ గ్రీన్' అనే సింగిల్ డ్యూయల్-టోన్ పెయింట్ కలర్‌లో మాత్రమే లభ్యం కానుంది.

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కవాసకి వెర్సిస్ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం కాను్ననాయి. తాజాగా కవాసకి వెర్సిస్ కూడా బిఎస్6కు అప్‌డేట్ కావడంతో, ఈ బ్రాండ్ అందిస్తున్న 650సిసి లైనప్‌లోని అన్ని మోటార్‌సైకిళ్ళు ఇప్పుడు బిఎస్6కి అప్‌గ్రేడ్ అయ్యాయి.

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ సిరీస్‌లో కవాసకి నింజా 650, మరియు జెడ్650 నేక్డ్ మోటార్‌సైకిళ్లు ఉ్ననాయి. కొత్త 2021 కవాసకి వెర్సిస్ పై రెండు మోడళ్ల మాదిరిగా మేజర్ అప్‌డేట్స్ పొందలేదు. బిఎస్6 నింజా 650, మరియు జెడ్650 మోడళ్లలో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ టెక్నాలజీతో మరియు రిఫ్రెష్డ్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. కానీ, వెర్సిస్‌లో మాత్రం ఇలాంటి మార్పులేవీ లేవు.

MOST READ: జూలై నెలలో కొత్త రికార్డు సృష్టించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సక్షన్స్ , ఎంతో తెలుసా ?

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎస్6 కవాసకి వెర్సిస్ బైక్‌లో అదే 649సిసి ఇండన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఉపయోగించారు. ఇందులోని లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 66 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది.

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్ నిర్మాణంలో డైమండ్ స్టీల్ ఛాసిస్స్‌ను ఉపయోగించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 150 మిమీ ట్రావెల్‌తో 41 మిమీ యుఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులను ఉపయోగించారు. అలాగే, వెనుక భాగంలో 145 మిమీ ట్రావెల్‌తో మోనో-షాక్ సెటప్‌ను ఉపయోగించారు. ఈ రెండు సస్పెన్షన్ యూనిట్లను పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది.

MOST READ:ఆటో అంబులెన్స్ .. కరోనా రోగులకు ఈ అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 300 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు ఒకే ఒక్క 250 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేస్తున్నారు.

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కవాసకి వెర్సిస్ మోటార్‌సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, 21 లీటర్ల భారీ ఇంధన ట్యాంక్, అప్-రైట్ హ్యాండిల్ బార్ మరియు మంచి కుషనింగ్ కలిగిన రైడర్ మరియు పిలియన్ సీట్‌లు ఉన్నాయి. కవాసకి వెర్సిస్ దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇందులో రోడ్-బయాస్డ్ టైర్లు ఉన్నప్పటికీ, ఇది లైట్ ఆఫ్-రోడింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:రాజ్‌కోట్‌లోని మహిళా పోలీసుతో గొడవపడిన రవీంద్ర జడేజా ; ఎందుకో తెలుసా ?

భారత్‌లో కవాసకి వెర్సిస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి తరం మోడల్‌లో చూసినట్లుగా ఈ మోటార్‌సైకిల్‌లో ఇప్పటికీ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌నే కలిగి ఉంది. ఇది గేర్ ఇండికేటర్, ట్రిప్-మీటర్, వేగం మరియు ఫ్యూయెల్ ఇండికేటర్లతో సహా రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. భారత విపణిలో కొత్త 2021 కవాసాకి వెర్సిస్ ధర రూ.6.79 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. బిఎస్4తో పోల్చుకుంటే దీని ధర రూ.10,000 అధికంగా ఉంటుంది.

కొత్త2021 కవాసకి వెర్సిస్ మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కవాసాకి వెర్సిస్ భారత మార్కెట్లోని మిడిల్-వెయిట్ అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్ విభాగంలో లభిస్తున్న అత్యంత సరసమైన మోడల్. ఇందులోని మునుపటి ఇంజన్‌ను బిఎస్6కు అప్‌గ్రేడ్ చేసినందను ధర స్వల్పంగా పెరిగింది. ఇది ఈ విభాగంలో సుజుకి వి-స్ట్రోమ్ 650 బిఎస్6 మోడల్‌కు పోటీగా నిలుస్తుంది.

*Note: Images used are for representational purposes only

Most Read Articles

English summary
Kawasaki has launched the MY2021 Versys BS6 motorcycle in the Indian market. The 2021 Kawasaki Versys retail at Rs 6.79 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X