Just In
- 11 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 12 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 12 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 క్రూయిజర్ విడుదల; ధర, ఫీచర్లు
కవాసాకి భారత మార్కెట్లో తమ సరికొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ '2021 వల్కాన్ ఎస్' బిఎస్6 మోడల్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2021 కవాసకి వల్కాన్ ఎస్ ధర రూ.5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ బిఎస్6 మోడల్ ధర భారత మార్కెట్లోని మునుపటి బిఎస్4 ధర కంటే రూ.30,000 అధికంగా ఉంది.

ఈ కొత్త బిఎస్6 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను మెటాలిక్ ఫ్లాట్ రా గ్రేస్టోన్ అని పిలిచే సరికొత్త డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్‌లో అందిస్తున్నారు. ఇందులో ఫ్యూయెల్ ట్యాంక్, అల్లాయ్ వీల్స్‌పై సన్నటి ఎరుపు రంగు డిజైన్ ఉంటుంది. మిగిలిన బాడీ మొత్తం ఎక్కువ భాగం గ్రే కలర్‌లో పెయింట్ చేయబడి ఉండి, చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 మోడల్ మునపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 649సిసి ఇంజన్‌ను కొత్తగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ లిక్విడ్-కూల్డ్ పారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 60 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 62.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కవాసకి జెడ్650 మరియు నింజా 650 మాదిరిగా కాకుండా, వల్కాన్ ఎస్‌లో కొత్త పెయింట్ మినహా డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పై రెండు మోడళ్లు బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటాయి.

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో రెట్రో-లుకింగ్ ఓవల్-షేప్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది, దాని చుట్టూ బ్లాక్ కలర్ కౌల్ ఉంటుంది. ముందు వైపు హెడ్‌ల్యాంప్‌కు దిగువవ రెండు చివర్లలో అమర్చిన టర్న్ ఇండికేటర్స్ మరియు వెనుక వైపు టెయిల్ ల్యాంప్‌తో పాటు అమర్చిన లోవర్-సెట్ టర్న్ సిగ్నల్, స్టయిలిష్ బై-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు ఇంజన్‌కు దిగువన అమర్చిన ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

కవాసకి వల్కాన్ ఎస్ మోటార్‌సైకిల్‌ను పెరిమీటర్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇది 1575 మిమీ పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 41 మిమీ ట్రావెల్‌తో కూడిన 130 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంవో ప్రీ-లోడెడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన ఆఫ్-సెట్ టైప్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌లు ఉంటాయి.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 300 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 250 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను కలిగి ఉంటుంది.

కవాసకి వల్కాన్ ఎస్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, 14-లీటర్ స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, అప్-రైట్ హ్యాండిల్ బార్ మరియు మంచి కుషనింగ్ కలిగిన రైడర్ అండ్ పిలియన్ సీట్స్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కూడా వల్కాన్ ఎస్‌పై సుదూర ప్రయాణానికి అనువుగా ఉంటాయి.

ఈ మోటార్‌సైకిల్ మునుపటి మోడళ్ల మాదిరిగానే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ఇది గేర్ ఇండికేటర్, ట్రిప్-మీటర్, స్పీడ్, మరియు ఫ్యూయెల్ ఇండెక్స్ మొదలైన రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

కొత్త 2021 కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 మోడల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కవాసాకి భారత మార్కెట్లో తన మొత్తం పోర్ట్‌ఫోలియోను క్రమక్రమంగా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే, వల్కాన్ ఎస్‌లో కంపెనీ ఈ కొత్త బిఎస్6 మోడల్‌ను ప్రవేశపెట్టింది. కవాసకి వల్కాన్ ఎస్ మంచి రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, ఇది సుదీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలుస్తుంది.