Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్-6 జెడ్ 900 మోటార్ సైకిల్ ని లాంచ్ చేసిన కవాసకి
జపాన్ సూపర్ బైకుల తయారీదారు అయిన కవాసకి ఇండియా 2020 ఇండియన్ ఆటో ఎక్స్పో వేదికగా బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైకుని లాంచ్ చేసింది. 2020 కొత్త కవాసకి బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

సాధారణంగా బిఎస్-4 కవాసకి జెడ్ 900 బైకు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 7.99 లక్షలు. ఇప్పుడు లాంచ్ చేసిన బిఎస్-6 వెర్షన్ ధర బిఎస్- 4 వెర్షన్ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం భారత విపణిలో బిఎస్-4 వెర్షన్ బైకులు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి. 2020 బిఎస్-6 బైకులు చూడటానికి మునుపటి మోడల్ ని పోలి ఉంటుంది. మునుపటి బిఎస్-4 మోడల్ బైక్ కంటే 2019 బిఎస్-4 బైక్ దాదాపు రూ. 30,000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 2019 మోడల్ లో కొంత అప్డేట్ తో పాటు రివైజ్డ్ డిజైన్ ని కలిగి ఉంటుంది.

కవాసకి జెడ్ 900 బైక్ 948సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 123బిహెచ్పి పవర్ మరియు 98.4ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

త్రీ లెవెల్ కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఉంటుంది, మరియు రెండు పవర్ మోడ్ లు ఉంటాయి. ఇది తక్కువ పవర్ మోడ్ అందుబాటులో ఉన్నప్పుడు 125 హెచ్‌పి వద్ద 55 % శక్తిని చాప్ చేస్తుంది. ఇది రోడ్లపై జారే పరిస్థితి ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.

కొత్త కవాసకి జెడ్ 900 లో స్పోర్ట్, రోడ్, రైన్ మరియు రైడర్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను కాలోఇఇజి ఉంటుంది. కానీ ఇందులో రైడర్ మోడ్ మాత్రం రైడింగ్ ప్రాధాన్యతను బట్టి సిస్టం ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది.

కొత్త 2020 జెడ్ 900 బిఎస్-6 జెడ్ 900 లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్, అప్డేటెడ్ సస్పెన్షన్ సెట్టింగ్స్, కొత్త 4.3-ఇంచుల టిఎఫ్టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇవే కాకూండా రైడియాలజీ మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్ల్పేకు మీ స్మార్ట్‌ఫోన్ అనుసంధానం చేసుకోవచ్చు. ఇది కొత్త స్పోర్ట్స్ మాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లని కలిగి ఉంటుంది.

2020 జెడ్ 900 కవాసకి బైక్ రెండు రంగులలో వస్తుంది. ఒకటి గ్రాఫైట్ గ్రే-మెటాలిక్ స్పార్క్ బ్లాక్, రెండు మెటాలిక్ స్పార్క్ బ్లాక్-మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్. ఈ 2020 కొత్త కవాసకి బైకులు ఈ నెల చివరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసిన బిఎస్-6 కవాసకి బైక్ మునుపటి బిఎస్-4 వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగినుంటుంది. ఈ బిఎస్ 6 కవసకి జెడ్ 900 మార్కెట్లోకి విడియూదాలైన తరువాత ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్, కెటిఎమ్ 790 డ్యూక్ మరియు సుజుకి జిఎస్ఎక్స్-ఆర్750 మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.