భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

కవాసకి ఇండియా తమ కొత్త 2021 జెడ్900 బిఎస్6 సూపర్‌బైక్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త కవాసకి జెడ్900 బిఎస్6 మోడల్ ధర రూ.7.99 లక్షలు, ఎక్స్-షోరూమ, ఢిల్లీగా ఉంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ మునుపటి బిఎస్4 మోడల్‌తో పోలిస్తే రూ.29,000 అధిక ధరను కలిగి ఉంది.

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

కొత్త కవాసకి జెడ్900 మోటార్‌సైకిల్లో ఇదివరకటి 948సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఇంజన్ దాని మునుపటి బిఎస్4 మోడల్ మాదిరిగానే ఒకేరకమైన పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 123 బిహెచ్‌పి పవర్‌ని మరియు 7700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

కొత్త 2021 మోడల్ ఇయర్ కవాసకి జెడ్900 మోటార్‌సైకిల్‌లో అప్‌డేట్ చేసిన ఇంజన్‌తో పాటుగా, ఇందులో అనేక కొత్త ఫీచర్లు, ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లు మరియు పరికరాలను కూడా జోడించారు. ఇందులో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.3 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌ను కవాసకి డెడికేటెడ్ ‘రైడాలజీ' యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

ఈ బిఎస్6 వేరియంట్ జెడ్900లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ (రోడ్, రైన్, మాన్యువల్ మరియు స్పోర్ట్) ఉంటాయి. ఇందులో రెండు పవర్ మోడ్‌లు మరియు త్రీ-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటాయి. కొత్త జెడ్900లో అప్‌డేట్ చేసిన ఎర్గోనామిక్స్, మెరుగైన సస్పెన్షన్ సెట్టింగ్స్ మరియు డన్‌లాప్ స్పోర్ట్స్ మాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు ఉన్నాయి.

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ అంశాలను గమనిస్తే, జెడ్900 ముందు భాగంలో 41 మిమీ ఇన్‌వెర్టెడ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి, ఈ రెండింటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకోవచ్చు. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 300 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 250 మిమీ డిస్క్‌ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 212 కిలోలు (కెర్బ్ వెయిట్) మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం 17 లీటర్లు. సీట్ ఎత్తు 820 మిమీగా ఉంటుంది.

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

కొత్త 2021 కవాసకి జెడ్900 బిఎస్6 మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవాసకి డీలర్‌షిప్‌లలో లభ్యం కానుంది. ఈ మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, త్వరలోనే డెలివరీలు కూడా స్టార్ట్ అవుతాయని కంపెనీ తెలిపింది. జెడ్900 మెటాలిక్ గ్రాఫైట్ గ్రే మరియు కాండీ లైమ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

MOST READ:షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

కవాసకి జెడ్900 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కవాసకి జెడ్900 భారతదేశంలోని సబ్ 1000 సిసి సూపర్‌బైక్ విభాగంలో లభిస్తున్న మోస్ట్ పాపులర్ మోడళ్లలో ఒకటి. భారతదేశంలో కవాసకి జెడ్900 కాంపిటీటివ్ ధరతో విడుదలైంది. ఇది ఈ విభాగంలో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్, కెటిఎమ్ 790 డ్యూక్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Kawasaki India has launched the MY2021 Z900 BS6 superbike in the market. The new Kawasaki Z900 BS6 model is offered with a price tag of Rs 7.99 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X