ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నకెటిఎమ్ 390 డెలివరీలు ఇప్పుడు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఈ బైకుల కోసం బుకింగ్ గత నెలలోనే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ 2019 ఇఐసిఎమ్ఏ షోలో ప్రదర్శించబడింది. కానీ అధికారికంగా భారతదేశంలోకి 2020 జనవరిలో ప్రవేశించింది. దీని కోసం బుకింగ్ గత నెలలోనే ప్రారంభించింది. ఇప్పుడు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలను కూడా ప్రారంభించింది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

ఇండియాలో కెటిఎమ్ 390 అడ్వెంచర్ ధర రూ. 2,99,000 (ఎక్స్ షోరూం). కెటిఎమ్ 390 అడ్వెంచర్ అంతర్జాతీయ స్పెక్ మోడల్ కి కొంత భిన్నంగా ఉంటుంది. దీని ముందు భాగంలో సస్పెన్షన్ కోసం అడ్జస్టబుల్ ఫంక్షన్ ని కోల్పోతుంది. దీనికి బదులుగా క్విక్‌షిఫ్టర్ ప్లస్ ని పొందుతుంది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ అడ్వాన్స్ వెయిట్ లైట్ ట్రేల్లిస్ ఫ్రేమ్ మరియు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 19 అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 17 అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ యొక్క కొలతలను గమనించినట్లయితే 2,154 మిమీ పొడవు, 900 మిమీ వెడల్పు మరియు 1,400 మిమీ ఎత్తును కలిగి ఉండటమే కాకుండా 1,430 మిమీ వీల్ బేస్ తో పాటు 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంటుంది. కెటిఎమ్ 390 అడ్వెంచర్ 162 బరువు కిలోలు ఉంటుంది. 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ని కలిగి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ 390 లో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్ మరియు టెయిల్ లాంప్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టిఎఫ్టి డిస్‌ప్లేతో టర్న్ బై టర్న్ నావిగేషన్‌ వంటివి ఉంటాయి. వీటితో పాటు క్విక్‌షిఫ్టర్ ప్లస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ యొక్క ఇంజిన్ లక్షణాలు ఇటీవల ప్రారంభించిన బిఎస్-6 డ్యూక్ 390 లాగ ఉంటాయి. 373.2 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, డిఓహెచ్‌సి ని కలిగి ఉంటుంది. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 43 హెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్‌ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది. బ్రేకింగ్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు భాగంలో 320 ఎంఎం డిస్క్ మరియు వెనుకవైపు 230 ఎమ్ఎమ్ డిస్క్ ని కలిగి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభమైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలు

కెటిఎమ్ అడ్వెంచర్ ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్‌, మరియు కవాసాకి వెర్సిస్ ఎక్స్ 300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది. కెటిఎమ్ అడ్వెంచర్ డెలివరీలు ఇప్పుడు భారత్ లో ప్రారంభమయ్యాయి. కెటిఎమ్ 390 అడ్వెంచర్ డెలివరీలను ప్రారంభించిన దేశాలలో ప్రపంచంలోనే మొట్ట మొదటి దేశం మన భారతదేశం.

Image Courtesy: KTM Alibag/Facebook

Most Read Articles

English summary
KTM 390 Adventure delivery starts in India – First in the world. Read in Telugu.
Story first published: Monday, February 3, 2020, 12:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X