దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న 390 అడ్వెంచర్ నుండి స్ఫూర్తి పొంది తయారు చేసిన లోవర్ డిస్‌ప్లేస్‌మెంట్ వెర్షన్ కెటిఎమ్ 250 అడ్వెంచర్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

కెటిఎమ్ 250 అడ్వెంచర్ కంపెనీకి ఓ కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్‌గా భారత్‌లోకి ప్రవేశించనుంది. అనధికారిక సమాచారం, ప్రకారం, కెటిఎమ్ ఇండియా ఇప్పటికే ఈ మోడల్‌ను తమ డీలర్‌షిప్ కేంద్రాలకు తరలిస్తోంది. కొన్ని మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

కెటిఎమ్ ఇప్పటికే తమ 250 అడ్వెంచర్ మోడల్‌ను భారత రోడ్లపై అనేకసార్లు పరీక్షించిన సంగతి తెలిసినదే. భారత్‌లో విడుదల కానున్న 250 అడ్వెంచర్, గతంలో కెటిఎమ్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన 250 అడ్వెంచర్ టూరర్ మాదిరిగానే ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెటిఎమ్ విక్రయిస్తున్న డ్యూక్ 250 నేక్డ్ మోటార్‌సైకిల్‌కు ఎగువన 250 అడ్వెంచర్ టూరర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

కెటిఎమ్ అందిస్తున్న పెద్ద అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్న స్టీల్-ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఆధారంగా చేసుకొని దాని సబ్‌ఫ్రేమ్‌పై ఈ కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసే అవకాశం ఉంది. దీని ముందు భాగంలో 100/90-19 మరియు వెనుక భాగంలో 130/80-17 టైర్ ప్రొఫైళ్లను కలిగి ఉండి, ఎమ్ఆర్ఎఫ్ మోగ్రిప్ మీటియోర్ ఎఫ్ఎమ్2 ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

ఈ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 170 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ డబ్ల్యూపి అపెక్స్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపు 177 మిమీ ట్రావెల్‌తో ప్రీలోడ్ అడ్జస్టబల్ డబ్ల్యూపి అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ సస్పెన్షన్ సెటప్ 390 అడ్వెంచర్ మోడల్‌లో కనిపించే వాటికి సమానంగా ఉంటుంది.

MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరంగా చూస్తే, కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఆఫ్-రోడ్ మోడ్‌తో డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌నే కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 250 అడ్వెంచర్‌లో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ మరియు క్విక్-షిఫ్టర్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

MOST READ:ట్రాక్టర్ అమ్మకాలలో దూసుకెళ్తున్న సోనాలికా.. కారణం ఏంటో తెలుసా !

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌లో ప్రస్తుతం డ్యూక్ 250లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే కొనసాగించవచ్చని సమాచారం. ఇందులోని 249సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 29.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కెటిఎమ్ 250 అడ్వెంచర్‌లోని ఇంజన్ కూడా ఇదేరకమైన పనితీరును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

దీపావళి కానుకగా రానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్

కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరమసైన ధరకే సౌకర్యవంతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే ఆస్కారం ఉంది. ఇది ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

Most Read Articles

English summary
KTM 250 Adventure is expected to launch in India during this festive season. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X