బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

ఆస్ట్రియా దేశానికి చెందిన దిగ్గజ రేసింగ్ స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కెటిఎమ్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకును లాంచ్ చేసింది. కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ ధర రూ. 2.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కేటిఎమ్ డీలర్లిు ఇప్పటికే రూ. 10,000 లతో బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ డెలివరీలు వచ్చే నెల చివరి నుండి ప్రారంభమవుతాయని డీలర్ల పేర్కొన్నారు. అడ్వెంచర్ 390 విడుదలతో కెటిఎమ్ ఇండియా ఇప్పుడు అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో కూడా ప్రవేశించింది.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

కెటిఎమ్ సంస్థ అడ్వెంచర్ 390 బైకును ఆఫ్-రోడింగ్ మరియు ఆన్-రోడింగ్ అవసరాల కోసం అడ్వెంచర్ శైలిలో తేలిక పాటి బరువున్న ట్రెల్లిస్ ఛాసిస్ మీద నిర్మించారు. ముందు వైపున 170మిమీ లాంగ్ ట్రావెల్ గల ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున 177మిమీల లాంగ్ ట్రావెల్ గల మోనో-షాక్ కలదు, రెండు సస్పెన్షన్ యూనిట్లను డబ్ల్యూపీ సంస్థ నుండి సేకరించారు.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ 200మిమీలుగా ఉంది, పొడవాటి వీల్‌బేస్, ఎత్తున్ను పెంచుకునే సౌకర్యం గల విండ్ షీల్డ్, ఇంజన్ ప్రొటెక్షన్ కోసం బాష్ ప్లేట్, మరియు డ్యూయల్ పర్పస్ మెట్జలర్ టైర్లు ఇందులో వచ్చాయి.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

కెటిఎమ్ అడ్వెంచర్ 390 బైకులో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కలదు, ఇది ఎలక్ట్రిక్ పరికరాలైనటువంటి లీన్ యాంగిల్ సెన్సిటివ్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్‌ను నియంత్రిస్తుంది. ఇది మట్టి మరియు గరుకైన రోడ్ల మీద అత్యుత్తమ ట్రాక్షన్ కల్పిస్తుంది. మలుపుల్లో మరియు కొండ లోయల్లో వచ్చే రోడ్ల మీద కార్నరింగ్ ఏబీఎస్ సురక్షితమైన మరియు షార్ప్ రైడింగ్ అదిస్తుంది. లో-ట్రాక్షన తలాల కోసం ఆఫ్-రోడ్ ఏబీఎస్ కూడా కలదు.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

ఇందులో క్విక్ షిఫ్టర్లు ఉన్నాయి. వేగవంతమైన మరియు అగ్రెసివ్ రైడింగ్‌కు ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఫోన్‌కు వచ్చే కాల్స్ కోసం కెటిఎమ్ మై రైడ్ స్మార్ట్ కనెక్టివిటి టెక్నాలజీ కూడా వచ్చింది. మ్యూజిక్, టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ మరియు ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్ల్పే కూడా వచ్చింది.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

సరికొత్త కెటిఎమ్ అడ్వెంచర్ 390 బైకులో సాంకేతికంగా 373.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్6 ప్రమాణాలను పాటించే ఈ ఇంజన గరిష్టంగా 43బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇందులో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు రైడ్-బై-వైర్ వంటి ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ ధరను రూ. 2.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ప్రకటించారు. దీనికి గట్టి పోటీగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జీ 310 జీఎస్ మోటార్ సైకిల్‌తో పోల్చితే 50 వేల వరకు చౌకగా లభిస్తోంది. కవాసకి వెర్సేస్ ఎక్స్-300 బైకుతో పోల్చుకుంటే రూ. 1.70 లక్షల వరకు చౌకగా లభిస్తోంది. డ్యూక్ 390 కంటే రూ. 30,000 అధికంగా ఉంది.

బ్రేకింగ్: కెటిఎమ్ అడ్వెంచర్ 390 విడుదల: ధర ఎంతో తెలుసా..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటి వరకూ స్పోర్ట్స్ మరియు స్ట్రీట్ ఫైటర్ వెర్షన్ మోటార్ సైకిళ్లను విక్రయించిన కెటిఎమ్ ఇండియా ఇప్పుడు ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, శక్తివంతమైన ఇంజన్ మరియు సాటిలేని డిజైన్ అంశాలతో విడుదలైన కెటిఎమ్ అడ్వెంచర్ 390 నిజంగా ధరకు తగ్గ విలువలతో వచ్చింది. డ్యూక్ 390 కంటే కేవలం 30 వేలు మాత్రమే ధర అధికంగా ఉండటంతో అడ్వెంచర్ 390 సేల్స్ కూడా భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
KTM Adventure 390 Launched At Rs 2.99 Lakh: Bookings Officially Open At Rs 10,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X