కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ కంపెనీ కెటిఎమ్ ఇండియా తమ కొత్త డ్యూక్ 250 బిఎస్6 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2020 కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 ధర రూ.2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త 2020 కెటిఎమ్ డ్యూక్ 250లో బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ అప్‌డేట్ మాత్రమే కాకుండా, కంపెనీ ఇందులో అనేక కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 ఇప్పుడు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో పాటు ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంటుంది. ఈ డిజైన్ చూడటానికి డ్యూక్ 390 మాదిరిగా అనిపిస్తుంది. కెటిఎమ్ డ్యూక్ 250ను ఇప్పుడు డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌తో పాటుగా సూపర్ మోటో మోడ్‌తో పరిచయం చేశారు. ఈ మోడ్ సాయంతో డ్యూక్ 250 బైక్‌లోని ఒక బటన్‌ను నొక్కడం ద్వారా వెనుక చక్రాలపై ఏబిఎస్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎస్6 కంప్లైంట్ కెటిఎమ్ డ్యూక్ 250లో చేసిన ఇతర మార్పులను గనిస్తే, ఇందులో కొత్త రెండు పెయింట్ స్కీమ్స్‌ను ప్రవేశపెట్టారు. అవి - డార్క్ గాల్వానో మరియు సిల్వర్ మెటాలిక్. ఈ రెండు కలర్ ఆప్షన్లు కూడా కొద్దిగా అప్‌గ్రేడ్ చేయబడిన బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తాయి. ఇది మోటార్‌సైకిల్ యొక్క స్పోర్టీ, అగ్రెసివ్ మరియు షార్ప్ డిజైన్‌ను మరింత పెంచడంలో సహకరిస్తుంది.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 కెటిఎమ్ డ్యూక్ 250 మోటార్‌సైకిల్ ఇప్పుడు అదే 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ యొక్క అప్‌గ్రేడెడ్ బిఎస్6 వెర్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ ఇప్పుడు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 29.6 బిహెచ్‌పి శక్తిని మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పైన చెప్పుకున్న మార్పులు తప్ప, ఇదివరకటి బిఎస్4 మోడల్‌లో కనిపించిన అనేక అంశాలు కొత్త కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6లో కూడా కొనసాగుతాయి. ఈ క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిల్ రెండు చివర్లలో డబ్ల్యూపి సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 43 మిమీ యూఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో 10-స్టెప్ అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటాయి.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ముందు మరియు వెనుక వైపున వరుసగా 320 మిమీ మరియు 230 మిమీ డిస్క్‌లు ఉంటాయి. ఇవి డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇందులో కొత్తగా, అవసరం లేదనుకుంటే వెనుక టైరులోని ఏబిఎస్‌ను స్విచ్ ఆఫ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ బరువు 169 కిలోలు, దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లుగా ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త డ్యూక్ 250 బిఎస్6ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, "కెటిఎమ్ 250 డ్యూక్ ప్రీమియం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న క్వార్టర్-లీటర్ మోటారుసైకిల్. కెటిఎమ్ యొక్క అసమాన రేసింగ్ లెగసీ నుండి ఈ వాహనం ఎంతో ప్రేరణ పొందింది. ఇది హైటెక్ రేస్-రెడీ ఇంజన్ మరియు భాగాలతో రూపుదిద్దుకుంది."

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"క్వార్టర్-లీటర్ కెటిఎమ్‌గా, ఇది బైకింగ్ పనితీరు మరియు అర్బన్ ప్రాక్టికాలిటీల కలయికలో ఉత్తమమైనదాన్ని అందిస్తుంది. కెటిఎమ్ 250 డ్యూక్‌లో తాజాగా చేసిన అప్‌డేట్స్ కారణంగా ఇది కోర్ బైకింగ్ ఔత్సాహికులను మరింత ఆకర్షించగలదని ఆశిస్తున్నామ"ని అన్నారు.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త బిఎస్6 కంప్లైంట్ కెటిఎమ్ డ్యూక్ 250 బైక్‌ను కొనాలనుకునే కస్టమర్లు కోసం బుకింగ్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలోని ఏ కెటిఎమ్ డీలర్‌షిప్‌నైనా సందర్శించవచ్చు. అతి త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కెటిఎమ్ 250 డ్యూక్ బిఎస్6 మోటార్‌సైకిల్ ఈ విభాగంలో మంచి సామర్థ్యం కలిగిన క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిళ్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్. ఇది ఈ విభాగంలో సుజుకి జిక్సెర్ 250 మరియు యమహా ఎఫ్‌జెడ్-25 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #కెటిఎమ్
English summary
KTM India has launched the Duke 250 BS6 motorcycle in the Indian market. The new (2020) KTM Duke 250 BS6 is offered with a price tag of Rs 2.09 lakh, ex-showroom (Delhi).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X