బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని బైకులను బీఎస్6 వెర్షన్‌లో ఒక్కసారిగా విపణిలోకి లాంచ్ చేసింది. కొన్ని మోడళ్లలో ఏబీస్, రైడింగ్ మోడ్స్, మరికొన్ని మోడళ్లలో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో అన్ని ఇంజన్‌ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసి రిలీజ్ చేసింది.

బీఎస్6 వెర్షన్‌లో వచ్చిన 7 కెటిఎమ్ బైకుల వేరియంట్లు, ఫీచర్లు, అప్‌డేట్స్, కొత్త టెక్నాలజీ, బుకింగ్స్, వేరియంట్లు, ధరలు మరియు ఫోటోలతో సహా పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ బీఎస్6 బైకుల టెస్టింగ్ ఫోటోలు గత కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్లో హల్‌చేశాయి. కస్టమర్లు కూడా బీఎస్6 మోడళ్ల విడుదల ఎప్పుడెప్పుడా అని చూశారు. ఎదురు చూపులకు స్వస్తి పలుకుతూ కెటిఎమ్ ఇండియా ఒకే రోజు అన్ని బైకులను బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ బేసిక్ మోడల్ 125 డ్యూక్ నుండి 390 డ్యూక్ వరకూ మొత్తం ఏడు మోడళ్లకు సంబంధించిన ఫోటలతో పాటు ధరలు కూడా అఫీషియల్ వెబ్‌సైట్లో వెల్లడించింది. మోడళ్ల వారీగా బీఎస్4 మరియు బీఎస్6 వెర్షన్ ధరలు ఇలా ఉన్నాయి.

Models BS6 Price BS4 Price Difference
200 Duke Rs 1,62,253 Rs 1,72,749 Rs 10,496
RC 200 Rs 1,90,630 Rs 1,96,768 Rs 6,138
250 Duke Rs 1,97,248 Rs 2,00,576 Rs 3,328
390 Duke Rs 2,48,212 Rs 2,52,928 Rs 4,716
RC 390 Rs 2,44,014 Rs 2,48,075 Rs 4,061
125 Duke Rs 1,32,500 Rs 1,38,041 Rs 5,541
RC 125 Rs 1,48,750 Rs 1,55,277 Rs 6,527
బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ 200 డ్యూక్ మరియు ఆర్సీ 200

కెటిఎమ్ 200 డ్యూక్‌ కంప్లీట్‌గా మారిపోయింది, మార్కెట్లో ఉన్న 250 డ్యూక్ డిజైన్ లక్షణాలతో ఈ మోడల్‌ను పూర్తిగా మార్చేశారు. డిజైన్ మారడంతో 10.2-లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ బదులుగా 13.5-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అందించారు. దీంతో పాటు 200 డ్యూక్ బైకులో ఎలక్ట్రానిక్ ఆరేంజ్ మరియు సిరామిక్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లు కూడా పరిచయం చేశారు.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

సాధారణ అప్‌డేట్స్ మినహాయిస్తే, ఇందులోని 199.5సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ను బీఎస్6 ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేశారు. బీఎస్6 ఇంజన్ 25పీఎస్ పవర్ మరియు 19.3 ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా దీని బరువు సుమారు 2.3కేజీల వరకూ పెరిగింది. ఇందులో ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వచ్చింది. కెటిఎమ్ 200 డ్యూక్ తరహాలో కాకుండా ఆర్సీ200 లో కూడా పలు మార్పులు జరిగాయి.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ 250 డ్యూక్

కెటిఎమ్ 250 డ్యూక్ మోడల్‌ను ఇది వరకే చూశాం, నిజం చెప్పాలంటే.. న్యూ బాడీ పెయింటింగ్ స్కీమ్‌‌లో కెటిఎమ్ అద్భుతం చేసింది. అదనంగా డ్యూయల్ ఛానల్ ఏబీస్ మరియు సూపర్‌మోటో రైడింగ్ మోడ్ అనే ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించింది. 248.8సీసీ కెపాసిటీ గల అదే పాత ఇంజన్‌ను బీఎస్6 ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసింది.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

390 డ్యూక్ మరియు ఆర్సీ 390

390 డ్యూక్ మోడల్ గత ఏడాది న్యూ జనరేషన్‌లో లాంచ్ అయ్యింది. అయితే, కొత్త తీసుకొచ్చిన 390 డ్యూక్‌లో కొన్ని కాస్మొటిక్స్ జోడించింది. దీనికి తోడు క్విక్‌షిఫ్టర్ అదనంగా వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఇందులోని 373.3సీసీ కెపాసిటీ గల ఇంజన్ కూడే అదే 43.5పీఎస్ పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

బీఎస్6 కెటిఎమ్ ఆర్సీ390 విషయానికి వస్తే, మెకానికల్‌గా 390 డ్యూక్ బైకులో వచ్చిన అదే ఇంజన్ యధావిధిగా ఇందులోనూ వచ్చింది. కానీ అక్కడక్కడా పలు కాస్మొటిక్ మెరుగు తోడయ్యాయి. ఆర్సీ 390 స్పోర్ట్స్ బైకును కంప్లీట్‌గా న్యూ లుక్‌లో తీసుకొస్తారనే రూమర్లు వచ్చాయి. అయితే ఇందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

కెటిఎమ్ 125 డ్యూక్ మరియు ఆర్సీ 125

కెటిఎమ్ లైనప్‌లో ఉన్న ఎంట్రీ లెవల్ మోటార్ సైకిళ్లు 125 డ్యూక్ మరియు ఆర్సీ 125, రెండింటినీ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు, ఇందులోని 124.7సీసీ కెపాసిటీ గల బీఎస్6 ఇంజన్ 14.5పీఎస్ పవర్ మరియు 12ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: 7 బైకులను బీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసిన కెటిఎమ్

సరికొత్త బీఎస్6 వెర్షన్ 125 డ్యూక్ మరియు ఆర్సీ 125 మోడళ్లు ఫిబ్రవరి చివరికల్లా అమ్మకాలకు సిద్దంగా మార్కెట్లోకి రానుంది. ఈ జాబితాలో పేర్కొన్న అన్ని బైకులు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2020, 16:41 [IST]
English summary
KTM’s Entire India Model Lineup Is Now BS6-compliant. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+