స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఇప్పుడు స్పోక్ వీల్స్‌తో ప్రవేశపెట్టింది. కెటిఎమ్ పవర్‌పార్ట్స్ కేటలాగ్‌లో ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్ కోసం స్పోక్ వీల్స్ ఫీచర్‌ను జోడించారు.

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

కాగా, కంపెనీ ఈ స్పోక్ వీల్స్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఈ మోడల్‌తో స్టాండర్డ్‌గా వచ్చే స్టాక్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌ను స్టీల్ స్పోక్ రిమ్స్‌కు మార్చడానికి అవసరమైన అన్ని అదనపు భాగాలను ఈ స్పోక్ వీల్స్ కిట్‌లో అందిస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో భాగంగా, ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్ కోసం డిస్కులను మరియు స్ప్రాకెట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

కాస్ట్ వీల్స్ నుండి స్పోక్ రిమ్స్‌కు మార్పు చేయబడి కెటిఎమ్ 390 అడ్వెంచర్‌తో ఆఫ్-టార్మాక్ రైడింగ్ చేసేటప్పుడు మెరుగైన బ్యాలెన్స్, దృఢత్వం మరియు విశ్వాసం లభిస్తుంది. ఇందులోని కాస్ట్ రిమ్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ యొక్క ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పరిమితం చేస్తుంది. అయితే, ఇప్పుడు ఇందులో కొత్తగా స్పోక్ రిమ్స్ అందుబాటులోకి రావటంతో దీనిపై ఆఫ్-రోడింగ్ మరింత ఆహ్లాదభరితంగా ఉంటుంది.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

కెటిఎమ్ 390 అడ్వెంచర్ కోసం కొత్త స్పోక్ రిమ్ ప్యాకేజీ మినహా ఇందులో వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. ఈ మోడల్ కోసం కంపెనీ అనేక ఇతర యాక్ససరీలను మరియు భాగాలను అందిస్తోంది. ఇందులో పన్నీర్స్, ట్యాంక్ బ్యాగ్, టాప్ బాక్స్, రియర్ ర్యాక్, శాడిల్ బ్యాగ్స్ మొదలైనవి ఉన్నాయి.

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

ఇంజన్ విషయానికి వస్తే, కెటిఎమ్ 390 అడ్వెంచర్‌లో దాని డ్యూక్ మరియు ఆర్‌సి వెర్షన్ల మాదిరిగానే 373సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది . ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

కెటిఎమ్ 390 అడ్వెంచర్‌ భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందిందిన మోడళ్లలో ఒకటిగా ఉంది. కెటిఎమ్ ఇండియా ఇటీవలే 390 అడ్వెంచర్‌కు దిగువన కొత్తగా బడ్జెట్ ఫ్రెండ్లీ 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

దీంతో ఇప్పుడు కెటిఎమ్ 250 అడ్వెంచర్ బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా మారింది. కెటిఎమ్ 250 అడ్వెంచర్ దాని పెద్ద బిగ్ బ్రదర్ అయిన 390 అడ్వెంచర్ మారిదిగానే ఒకేరకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 250లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించారు.

MOST READ:బ్రేకింగ్.. 6 సీటర్ థార్ ఎస్‌యూవీని నిలిపివేయనున్న మహీంద్రా.. ఎందుకో తెలుసా !

స్పోక్ వీల్స్‌తో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్

అడ్వెంచర్ మోటార్‌సైక్లింగ్ కోసం కెటిఎమ్ 390 అడ్వెంచర్ అత్యంత పాపులర్ అయిన మోడల్, ఇది ఎలాంటి భూభాగాలపైనైనా సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన స్పోక్ వీల్స్ ఫీచర్‌తో దీని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతాయి. ఇది ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
KTM India Offers 390 Adventure Motorcycle With New Spoke Wheels. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X