త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కెటిఎమ్ 250 అడ్వెంచర్ పేరిట కంపెనీ ఓ కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది.

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

తాజాగా, జిగ్‌వీల్స్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, కెటిఎమ్ 250 అడ్వెంచర్ యొక్క ప్రీ-లాంచ్ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన స్లైడ్‌లో ఓ చిత్రం లీక్ అయింది. ఇందులో ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించిన కొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. కెటిఎమ్ ఇప్పటికే తమ 250 అడ్వెంచర్ మోడల్‌ను భారత రోడ్లపై అనేకసార్లు పరీక్షించింది.

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

కెటిఎమ్ అంతర్జాతీయ మార్కెట్లలో తమ అడ్వెంచర్ టూరర్‌ను ఆవిష్కరించింది, ఆ సమయంలో దాని డిజైన్ మరియు ఫీచర్లను చాలావరకు వెల్లడించింది. భారత్‌లో కెటిఎమ్ నుండి రాబోయే ఈ కొత్త మోటార్‌సైకిల్ డ్యూక్ 250 మోడల్‌కు ఎగువన ఉంచబడుతుంది మరియు ఇది నేక్డ్ మోటార్‌సైకిల్ కంటే కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా.

MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

కెటిఎమ్ అందిస్తున్న పెద్ద అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్న స్టీల్-ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఆధారంగా చేసుకొని దాని సబ్‌ఫ్రేమ్‌పై ఈ కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసే అవకాశం ఉంది. దీని ముందు భాగంలో 100/90-19 మరియు వెనుక భాగంలో 130/80-17 టైర్ ప్రొఫైళ్లను కలిగి ఉండి, ఎమ్ఆర్ఎఫ్ మోగ్రిప్ మీటియోర్ ఎఫ్ఎమ్2 ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 170 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ డబ్ల్యూపి అపెక్స్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపు 177 మిమీ ట్రావెల్‌తో ప్రీలోడ్ అడ్జస్టబల్ డబ్ల్యూపి అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ సస్పెన్షన్ సెటప్ 390 అడ్వెంచర్ మోడల్‌లో కనిపించే వాటికి సమానంగా ఉంటుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరంగా చూస్తే, కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఆఫ్-రోడ్ మోడ్‌తో డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌నే కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 250 అడ్వెంచర్‌లో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ మరియు క్విక్-షిఫ్టర్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; వివరాలు

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌లో ప్రస్తుతం డ్యూక్ 250లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే కొనసాగించవచ్చని సమాచారం. ఇందులోని 249సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 29.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కెటిఎమ్ 250 అడ్వెంచర్‌లోని ఇంజన్ కూడా ఇదేరకమైన పనితీరును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరమసైన ధరకే సౌకర్యవంతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే ఆస్కారం ఉంది. ఇది ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

Most Read Articles

English summary
KTM 250 Adventure is expected to launch soon in the Indian market. According to the latest report, the company is preparing for the pre-launch training process of the upcoming entry-level adventure-tourer motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X