Just In
- 4 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 5 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 7 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 9 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇప్పుడే చూడండి....గాలిలో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేసింది!
సాధారణంగా నేలపైన వెళ్లే మోటార్ సైకిల్ ని చూసి ఉంటాం. ఇప్పుడు ఫ్రెంచ్ ఆటోమోటివ్ కంపెనీ గాలిలో ఎగిరే బైక్ ని మనముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం!
ఫ్రెంచ్ ఆటోమోటివ్ కంపెనీ లాజారెత్ అనే కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది. అది హోవర్బైక్గా మారి మిమ్మల్ని గాలిలోకి తీసుకెళ్తుంది. కొత్త ఉత్పత్తి ఎల్‌ఎమ్‌వి 496 ను ఈ సంవత్సరం ప్రారంభంలో తయారీదారు వెల్లడించారు మరియు ఇది దాదాపుగా ఇది ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. లాజరేత్ 496 ధర 380,000 డాలర్లతో వస్తుంది. ఇది మన భారత మార్కెట్లో సుమారు 3.5 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఇది మార్కెట్లో చాలా లగ్జరీ వాహనాల కంటే ఖరీదైనది.
లాజారెత్ ఎల్‌ఎమ్‌వి 496 సాధారణ బైక్ లాగా రోడ్డుపై నడుస్తుంది మరియు దాని కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. బైక్ గాలిలో కదిలినప్పుడు ఇది నాలుగు జెట్ ప్రొపల్షన్ ఇంజన్లను ఉపయోగిస్తుంది. ఇవి 10 నిమిషాల విమాన ప్రయాణంలాగ ఉంటుంది. ఎల్‌ఎమ్‌వి 496 కి శక్తినిచ్చే జెట్ ఇంజన్లు విమానం జెట్ ఇంజిన్ల మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ ఆన్-బోర్డులో కిరోసిన్ ఇంధన ట్యాంక్ ఉంది. కంపెనీ ప్రారంభంలో బైక్ కోసం ఐదు ప్రోటోటైప్లను నిర్మిస్తుంది.
ఎవరైనా తమ కొత్త బైక్ కి వెంటనే అలవాటుపడే విధంగా తాము రూపొందించామని లాజారెత్ పేర్కొన్నారు. ఇది చాలా సౌకర్యవంతమైన డ్రైవింగ్ ని కలిగించడమే కాకుండా తేలికపాటి స్టీరింగ్ కలిగి ఉంది. బైక్‌లోని బ్రేకింగ్ సిస్టమ్ మరియు అండర్ క్యారేజ్ టెక్నాలజీ ఇతర లాజరేత్ వాహనాల నుండి ప్రేరణ పొందాయి. ఇది చాలా అధునాతన టిఎఫ్ఎక్స్ సస్పెన్షన్ టెక్నాలజీపై నడుస్తుంది.
బైక్‌లోని నాలుగు జెట్ ఇంజన్లు సమిష్టిగా 1,300 హార్స్పవర్ థర్స్ట్ను ఉత్పత్తి చేస్తాయి. ఎత్తు, వేగం, ఇంధన స్థాయి, స్థానం, దిశ మొదలైనవన్నీ విమానంలోలాగ ప్రదర్శించబడతాయి. బైక్ మొత్తం బరువును తేలికగా ఉండాటానికి లాజారెత్ బైక్‌ను అధునాతన కెవ్లర్ కార్బన్ మిశ్రమాన్ని ఉపయోగించారు.
కెవ్లార్ అనేది బుల్లెట్ ప్రూఫ్ పదార్థం ఇది వాహనాలకు కవచంలాగ ఉంటుంది. సాధారణంగా కెవ్లార్ ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు సూట్లను తయారు చేయడానికి ఉపయోగింస్తారు. రహదారిలో ఉన్నప్పుడు బైక్ ఎలక్ట్రిక్ మోటారుపై నడుస్తుంది. ఇది ఒకే ఛార్జీపై 60 మైళ్ళ దూరం ప్రయాణించగలదు. బైక్ గాలిలో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ మోటారు పాత్ర ఉండదు. బైక్ బరువు కేవలం 140 కిలోలు మాత్రమే!
టర్బైన్లు జెట్క్యాట్ నుండి వస్తాయి మరియు అవి గరిష్టంగా 96,000 ఆర్‌పిఎమ్ వేగంతో తిరగగలవు. బైక్ గాలిలో ఉన్నప్పుడు హ్యాండిల్‌బార్‌కు ఇరువైపులా ఉంచే జాయ్స్టిక్ల ద్వారా నియంత్రించవచ్చు. ఈ బైక్ భూమికి దాడ్పు 3.3 అడుగుల ఎత్తులో కదలగలిగే సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.
Read More:2020 ఆటో ఎక్స్పో ఢిల్లీలో ప్రదర్శించబోతున్న టాప్10 కార్లు ఇవే!
ఇది భవిష్యత్తులో ట్రాఫిక్లను దాటవేయగల హోవర్బైక్లాగ ఉపయోగపడుతుంది. ఈ యంత్రాన్ని నడపడానికి లేదా ఎగరడానికి ఏదైనా ప్రత్యేక లైసెన్స్ అవసరమా అని తెలియదు కాని ఇది ప్రత్యేకమైనది మరియు ఉత్పత్తి కేవలం ఐదు యూనిట్లకు మాత్రమే పరిమితం అయినందున. వినియోగదారులు ఇంకా ప్రజా రహదారులపై స్టంట్స్ చేయడానికి ప్రయత్నించరు.
Read More:ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!
ఏదిఏమైనా ఇటువంటి ఎగిరే బైక్ లు వచ్చినట్లైతే దాదాపు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. దీనికోసం ఇంకా కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!