వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

వెస్పా, ఆప్రిలియా వంటి ప్రీమియం స్కూటర్లను ఏకకాలంలో డబ్బు చెల్లించి కొనలేకపోతున్నారా? లేదా వీటిని మీరు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకోవటం లేదా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. ఈ స్కూటర్ల కోసం వాహన లీజింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు పియాజ్జియో ఇండియా, ఓటిఓ క్యాపిటల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

దేశంలో పియాజ్జియో విక్రయించే వెస్పా మరియు ఆప్రిలియా రేంజ్ స్కూటర్ల కోసం కంపెనీ కొత్త యాజమాన్య పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో, భాగంగా కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించి, ఈ స్కూటర్లను లీజుకు తీసుకోవచ్చు.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

స్కూటర్ యాజమాన్యం సౌలభ్యం కోసం భారత వినియోగదారులకు ఆకర్షణీయమైన మరియు లాభదాయకమైన లీజింగ్ ఆప్షన్‌ను అందించడమే ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యమని ఇరు కంపెనీలు తెలిపాయి. ఇందులో తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు స్కూటర్ల ఈఎమ్ఐపై 30 శాతం తగ్గింపు కూడా ఉంటుంది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

దీనికి అదనంగా, కంపెనీ తమ కస్టమర్లకు మొదటి నెల చందా రుసుముపై (సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై) రూ.2,500 వరకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను కూడా అందిస్తోంది. లీజింగ్ వ్యవధి ముగిసే నాటికి, వినియోగదారులు తమ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటం లేదా స్వంతం చేసుకోవడానికి ఆప్షన్లు ఇవ్వటం జరుగుతుంది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

ఈ కొత్త రకం సేవలు ప్రస్తుతానికి పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ సదుపాయాన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

ఈ లీజింగ్ ఆప్షన్‌ను పొందడానికి, కస్టమర్లు ఓటిఓ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెస్పా మరియు ఆప్రిలియా డీలర్‌షిప్‌లలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలను కస్టమర్లకు త్వరగా మరియు ఎలాంటి భౌతిక పత్రాలు లేకుండా మరియు ఎలాంటి ఇబ్బంది లేని లీజింగ్ విధానాన్ని అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

ఈ కొత్త ఓనర్‌షిప్ మోడల్‌ను ఎంచుకునే కస్టమర్‌లు స్కూటర్‌ను ఉంచాలని కోరుకుంటున్న సంవత్సరాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. వారు తమ స్కూటర్‌ను ఎప్పుడైనా తిరిగి ఇవ్వవచ్చని, ఇది వారికి సంప్రదాయ వన్-టైమ్ చెల్లింపు కొనుగోలు ప్రక్రియ కంటే తక్కువ చెల్లించడానికి సహాయపడుతుందని కంపెనీ వివరించింది.

MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

ఇలాంటి లీజింగ్ ఆప్షన్ల సాయంతో కస్టమర్లు అదే ఈఎమ్ఐ బడ్జెట్‌తో మరింత మెరుగైన మరియు తాజా మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. వీటితో పాటు, ఓటిఓ క్యాపిటల్‌తో ముడిపడి ఉన్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు వెస్పా మరియు ఆప్రిలియా స్కూటర్లను ఇబ్బంది లేని లీజింగ్‌ను ఆస్వాదించవచ్చు, మరియు అది వారికి అదనపు పన్ను ఆదాను కూడా అందిస్తుంది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

ఓటిఓ క్యాపిటల్‌తో ఉన్న అనుబంధం గురించి పియాజ్జియో ఇండియా చైర్మన్ మరియు ఎమ్‌డి డియెగో గ్రాఫి మాట్లాడుతూ, "ఈ కొత్త మోడల్ యాజమాన్యాన్ని సులభతరం చేయడానికి ఓటిఓ క్యాపిటల్‌తో భాగస్వామ్యాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇప్పుడు, మా కస్టమర్లు వెస్పా మరియు ఆప్రిలియా వంటి ప్రీమియం ఉత్పత్తులను ఆసక్తికరమైన యాజమాన్య ఎంపికలతో పొందవచ్చు. ఈ లీజింగ్ విధానాన్ని భారతదేశ యువతలో సౌకర్యవంతమైన యాజమాన్యం కోసం ఒక కొత్త ధోరణిగా మేము పరిగణిస్తున్నాము మరియు వెస్పా, ఆప్రిలియా మోడళ్ల ప్రీమియం అనుభవాన్ని మరింత విస్తరించడానికి ఇది దారితీస్తుందని మేము భావిస్తున్నామని" అన్నారు.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

వెస్పాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే స్పెషల్ ఎడిషన్ వెస్పా రేసింగ్ సిక్స్టీస్ పేరిట ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ 125 సిసి మరియు 150 సిసి ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. వెస్పా రేసింగ్ సిక్స్టీస్ ప్రారంభ ధర రూ.1.2 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లను కొనలేకపోతున్నారా? అయితే లీజుకు తీసుకోండి!

వెస్పా, ఆప్రిలియా స్కూటర్ల లీజింగ్ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వెస్పా మరియు ఆప్రిలియా రెండు బ్రాండ్‌లు కూడా భారత ద్వికచ్ర వాహన మార్కెట్లో ప్రీమియం స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉన్న మోడళ్లు. ఈ ప్రీమియం స్కూటర్లను సులువుగా సొంతం చేసుకోవాలని చూస్తున్న వినియోగదారులకు కంపెనీ ఇప్పుడు ఇబ్బందులు లేని లీజింగ్ విధానాన్ని అందిస్తోంది.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Piaggio India has partnered with OTO Capital to introduce vehicle leasing option in the country. Vespa and Aprilia range of scooter sold by Piaggio being offered with a new ownership scheme. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X