మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం, మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న బిఎస్6 మోజో 300సీసీ నేక్డ్ మోటార్‌సైకిల్‌పై కంపెనీ ఓ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలలో మహీంద్రా మోజోను కొనుగోలు చేసే కస్టమర్లు ఇప్పుడు రూ.4,901 విలువైన షిరో హెల్మెట్‌ను ఉచితంగా పొందవచ్చు.

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

మహీంద్రా మోజో కొనుగోలుపై ఉచిత షిరో బ్రాండ్ హెల్మెట్ ఆఫర్ డిసెంబర్ 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020వ తేదీల మధ్య చేసిన కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెలలో ఇప్పటికే మహీంద్రా మోజోను కలిగి ఉన్న కస్టమర్లు, ఈ బైక్ కోసం కొత్త వారిని రెఫర్ చేసినట్లయితే, వారికి రిఫెరల్ ఆఫర్‌ను కూడా మహీంద్రా అందిస్తోంది.

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

కొత్త కస్టమర్‌ను మహీంద్రా మోజో బ్రాండ్‌కు పరిచయం చేసినందకు గానూ, రెఫరల్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ వారికి పూర్తి-గాంట్లెట్ రైడింగ్ గ్లౌజులను అందిస్తోంది. రెఫర్ చేయబడిన కొత్త కస్టమర్ విజయవంతంగా మోజోని కొనుగోలు చేసిన తర్వాత, రెఫర్ చేసిన ప్రస్తుత మోజో యజమానులకు ఈ హ్యాండ్ గ్లౌజులను ఉచితంగా ఇస్తారు.

MOST READ:తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

ప్రస్తుతం మార్కెట్లో మహాంద్రా మోజో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ బ్లాక్ పెరల్ ధర రూ.1.99 లక్షలుగా ఉంటే, మిడ్-వేరియంట్ గార్నెట్ బ్లాక్ ధర రూ.2.06 లక్షలుగానూ మరియు టాప్-ఎండ్ వేరియంట్ రూబీ రెడ్ మరియు రూబీ అగెట్ ధర రూ.2.11 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

బిఎస్6 వెర్షన్ మహీంద్రా మోజోలో 294.7సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7,300 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 25.35 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.0 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

కొత్త మహీంద్రా మోజో బిఎస్6లో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇందులో ఆకర్షణీయమైన డ్యూయల్ హెడ్‌ల్యాంప్స్ సెటప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 21-లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

ఈ మోటర్‌సైకిల్ 815 మిమీ సీట్ హైట్‌తో చాలా సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. సుదూర ప్రయాణాలకు ఈ మోటార్‌సైకిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇందులో సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

అలాగే, బ్రేకింగ్ ఫీచర్లను గమనిస్తే, దీని ముందు భాగంలో రేడియల్‌గా అమర్చిన కాలిపర్‌తో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మహీంద్రా మోజోను కంపెనీ స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌తో అందిస్తోంది. ఈ మోటారుసైకిల్ 186.2 కిలోల కెర్బ్ వెయిట్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా మోజోపై డిసెంబర్ 2020 ఆఫర్; కస్టమర్లకు ఉచిత షిరో హెల్మెట్

ఇందులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ యూనిట్, స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్-అప్ సింగిల్-పీస్ సీట్, స్పీడ్, గేర్ స్థానం, ఓడోమీటర్ మరియు ట్రిప్-మీటర్‌లను ప్రదర్శించే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు పెద్ద రేడియేటర్ కవర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:37 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ అందజేసిన మొదటి మారుతి 800 కారు ఇదే, చూసారా..!

Most Read Articles

English summary
Mahindra Mojo 300 Customers To Get Free Shiro Helmet In December 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X