YouTube

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో' లో కంపెనీ ఓ కొత్త బిఎస్వె ర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి కొత్త మహీంద్రా మోజో బిఎస్ బైక్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా ఇందులో మరే ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

మహీంద్రా తమ మోజో మోటార్‌సైకిల్‌ను 2015లో తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ గురించి అప్పట్లో ఎన్నో అంచనాలు ఉండేవి, మహీంద్రా ఆ అంచనాలను నిజం చేస్తూ అత్యంత సరసమైన ధరకే ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా మోజో బైక్‌కు మార్కెట్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రత్యేకించి ఈ బైక్ హెడ్‌లైట్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంది.

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

మహీంద్రా మోజో మోటార్‌సైకిల్ రైడింగ్ పొజిషన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులోని సీటింగ్ డిజైనే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఆకర్షనీయమైన మోడ్రన్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, మహీంద్రాకు టూవీలర్స్‌కు మార్కెట్లో పెద్దగా మార్కెట్ వాటా లేకపోవటంతో మహీంద్రా మోజో కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది.

MOST READ: వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

ఈ నేపథ్యంలో మహీంద్రా మోజో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఇందులో మరో చవక వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బైక్ యూటి300 మరియు ఎక్స్‌టి300 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది బేస్ వేరియంట్, రెండవది టాప్-ఎండ్ వేరియంట్. ఈ రెండు వేరియంట్లలో దాదాపు అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి, బేస్ వేరియంట్‌లో మాత్రం ఒకవైపే ఎగ్జాస్ట్ ఉంటుంది.

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

గతేడాది మహీంద్రా మోజో బైక్‌లో కంపెనీ ఈ రెండు వేరియంట్లకు నడుమన 'మోజో 300 ఏబిఎస్' అనే కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది, కానీ ఆ మోడల్ ఆశించిన రీతిలో అమ్ముడుపోలేదు. ఇదే సమయంలో బజాజ్ డామినార్ 400 మోటార్‌సైకిల్ పవర్‌ఫుల్ ఇంజన్‌తో అప్‌గ్రేడ్ కావటం మహీంద్రా మోజో 300 బైక్‌కి పెద్ద ఛాలెంజ్‌గా మారింది.

MOST READ: బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

ఇదివరకు వచ్చిన కథనాల ప్రకారం, మహీంద్రా ఇకపై మోజో బైక్‌ను నిలిపివేస్తుందని, ఇందులో బిఎస్6 వెర్షన్ రాదనే వార్తలు వినిపించాయి. కాగా.. తాజాగా మహీంద్రా మోజో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఓ కస్టమర్ ఇందులో బిఎస్6 వెర్షన్ వస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహీంద్రా సమాధానమిస్తూ.. అవును ఇందులో బిఎస్6 వస్తుంది, ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని సమాధానం ఇచ్చింది.

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

కొత్త బిఎస్6 మహీంద్రా మోజోకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ఈ మార్పులు కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్ వరకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. జావా మరియు జావా ఫోర్టీ-టూ మోటార్‌సైకిళ్లు కూడా మహీంద్రా గ్రూపుకి చెందినవే. ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు.

MOST READ: సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

మహీంద్రా గ్రూప్ ఇప్పటికే జావా మోటార్‌సైకిళ్లలో బిఎస్6 ఇంజన్లను అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో అదే ఇంజన్‌ను మహీంద్రా మోజో బైక్‌లో కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇందులోని 293సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 26.2 బిహెచ్‌పిల శక్తిని మరియు 27.05 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది .08 బిహెచ్‌పిల తక్కువ శక్తిని, 0.95 ఎన్ఎమ్‌ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

సస్పెన్షన్, బ్రేక్స్ వంటి ఇతర భాగాలు ఇది వరకటి బిఎస్‌4 లోని మాదిరిగానే ఉండనున్నాయి. ఇందులో ముందు వైపు 320 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ ఉంటుంది, ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను బైబ్రి కంపెనీ సప్లయ్ చేస్తోంది. ఇకపోతే ముందు వైపు టెలిస్కోపిక్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఈ బైక్‌లో పీరెల్లీ ఏంజెల్ సిటి టైర్స్ ఉండొచ్చని అంచనా.

MOST READ: మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు

విడుదలకు సిద్ధమైన మహీంద్రా మోజో బిఎస్6 - వివరాలు

మహీంద్రా మోజో బిఎస్6 బైక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వాస్తవానికి మహీంద్రా మోజో చాలా అద్భుతమైన మోటార్‌సైకిల్. ప్రత్యేకించి దీని రైడింగ్ పొజిషన్ ఈ సెగ్మెంట్లోని ఇతర మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. అంతేకాదు ధరలో కూడా అందుబాటులో ఉండే 300సీసీ బైక్ ఇది. అమ్మకాల పరంగా ఈ మోడల్ ఎక్కువ నెంబర్లను సొంతం చేసుకోకపోయినప్పటికీ, బైకర్స్ కమ్యూనిటీలో మాత్రం మంచి పాపులారిటీని దక్కించుకుంది.

Source: Bikeadvice

Most Read Articles

English summary
Mahindra Two-Wheelers has confirmed the arrival of the Mojo BS6 motorcycles in the Indian market by the end of this month. The BS6 motorcycle is expected to remain similar to its BS4 counterpart, apart from an updated engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X