మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో' బిఎస్6కి సంబంధించి తాజాగా మరో సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఈ మోటార్‌సైకిల్‌ను కంపెనీ రూ.2 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చని సమాచారం. ఈ మోటార్‌సైకిల్ బిఎస్6 ఇంజన్ స్పెసిషిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి.

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

జిగ్‌వీల్స్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, బిఎస్6 మహీంద్రా మోజో రూ.2 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 294-7సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ బిఎస్4 ఇంజన్ గరిష్టంగా 25.2 బిహెచ్‌పి శక్తిని, 28 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

అదే బిఎస్4 మహీంద్రా మోజో 300 మోటార్‌సైకిల్ ఇంజన్ పవర్ ఫిగర్స్‌ను గమనిస్తే, అది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 26.29 బిహెచ్‌పి శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసేది. అంటే, బిఎస్6తో పోల్చుకుంటే బిఎస్6 మోజోలో ఇంజన్ పరవర్ కాస్తంత తగ్గుతుంది, టార్క్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా ఈ కొత్త మోజో బిఎస్6 మోటారుసైకిల్ సబ్‌ఫ్రేమ్‌లో స్వల్ప మార్పులు చేసింది, ఫలితంగా మునుపటి బిఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త 2020 వెర్షన్ మోటార్ సీటు ఎత్తు 15 మిమీ అధికంగా ఉంటుంది. అంటే, ఇప్పుడు బిఎస్6 మహీంద్రా మోజో సీట్ హైట్ 830 మిమీ (బిఎస్4లో 815 మిమీ) ఉంటుంది.

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనున్నారు.

MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ యూనిట్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్-అప్ సింగిల్ పీస్ సీట్, వేగం, గేర్ స్థానం, ఓడోమీటర్ మరియు ట్రిప్-మీటర్‌ను ప్రదర్శించే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు పెద్ద రేడియేటర్ కవర్లు ఉంటాయి.

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా ఈ కొత్త మోడల్‌లోని అల్లాయ్ వీల్స్‌పై ఎమ్ఆర్‌ఎఫ్ టైర్లను అమర్చాలని ఎంచుకుంది. ఇదివరకటి బిఎస్4 కంప్లైంట్ మోడళ్లలో ఉపయోగించిన ప్రీమియం పిరెల్లి ఏంజెల్ సిటి టైర్లను కొత్త బిఎస్6 మోడళ్లలో అందించడం లేదు.

MOST READ:బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా మోజో బిఎస్6 మోడల్ మొత్తం నాలుగు కొత్త రంగులలో లభ్యం కానుంది. ఇందులో బ్లాక్ పెరల్ ధర రూ.1,99,900, గార్నెట్ బ్లాక్ మరియు రూబీ రెడ్ ధరలు రూ.2,06,000 మరియు రెడ్ అగేట్ ధర రూ.2,11,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా టూ-వీలర్ సంబంధిత వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ గస్టో 110 సిబిఎస్ మరియు 125 సిబిఎస్ మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను రూ.51,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. దేశంలో తప్పనిసరి చేసిన భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ రెండు స్కూటర్లను అప్‌గ్రేడ్ చేశారు.

MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?

మహీంద్రా మోజో బిఎస్6 ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడి!

మహీంద్రా మోజో ధరపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా మోజో 300 బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు, అప్‌గ్రేడ్స్ ఏవీ లేకపోయినప్పటికీ దీని ధర మాత్రం గణనీయంగా పెరిగినట్లు అనిపిస్తోంది. మునుపటి తరం మోజోతో పోల్చుకుంటే, కొత్త బిఎస్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్ మినహా వేరే ఇతర మార్పులు లేవనిపిస్తోంది. బహుశా ఇది ధరకు తగిన విలువను ఇవ్వకపోవచ్చనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Prices and specs for the new Mahindra Mojo BS6 models have been revealed online. According to Zigwheels, the motorcycle will be launched in India starting at Rs 2 lakh, ex-showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X