మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో' లో కంపెనీ ఓ కొత్త బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించి మరో టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది.

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

మహీంద్రా టూవీలర్స్ తాజాగా విడుదల చేసిన చిత్రంలో కంపెనీ ఇందులో ఆఫర్ చేయబోయే కొత్త పెయింట్ స్కీమ్‌ను పరిచయం చేసింది. బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌లో ఉండే సరికొత్త గార్నెట్ బ్లాక్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త రంగు కలయిక మోజోకు మరింత క్యారెక్టర్‌ను జోడిస్తుంది.

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

ఈ స్పెషల్ కలర్‌లో వచ్చే మహీంద్రా మోజో మోటార్‌సైకిల్ హెజ్‌లైట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఇంజన్ కౌల్ మరియు చక్రాలను పూర్తిగా నలుపు రంగులో పెయింట్ చేశారు. అయితే, ఛాస్సిస్ మరియు స్వింగార్మ్‌ను మాత్రం ఎరుపు రంగులో పెయింట్ చేశారు. చక్రాలపై పిన్‌స్ట్రిప్స్ కూడా ఎరుపు రంగులో ఉంటాయి.

MOST READ:గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న మహీంద్రా మోజో బిఎస్6 మోడల్ ప్రస్తుత తరం మోడళ్ల మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ను క్యారీ చేయనున్నాయి. డ్యూయెల్ హెడ్‌ల్యాంప్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 21-లీటర్ పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి బిఎస్4 మోడల్‌లోని అన్ని ఇతర డిజైన్ అంశాలు బిఎస్6 మోడళ్లలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లో 815 మిమీ సీట్ హైట్ రైడర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

ఇందులో ముందు వైపు 320 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ ఉంటుంది, ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను బైబ్రి కంపెనీ సప్లయ్ చేస్తోంది. ఇకపోతే ముందు వైపు టెలిస్కోపిక్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఈ బైక్‌లో పీరెల్లీ ఏంజెల్ సిటి టైర్స్ ఉండొచ్చని అంచనా.

MOST READ:బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

ఇందులో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా డిజైన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. మహీంద్రా మోజో 300 బిఎస్‌6 మోటార్‌సైకిలో ఇదివరకటి 294.72సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ బిఎస్4 ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 26.29 బిహెచ్‌పి శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బిఎస్6 వెర్షన్‌లో ఈ ఇంజన్ పవర్ కాస్తంత తగ్గొచ్చని అంచనా.

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

మహీంద్రా టూవీలర్స్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ గస్టో 110 సిబిఎస్ మరియు 125 సిబిఎస్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.51,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. 125సిసి కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలు కాంబి-బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉండాలని మరియు 125 సిసి కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలు కనీసం సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను కలిగి ఉండాలని దేశంలో తప్పనిసరి చేసిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త స్కూటర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

మహీంద్రా మోజో బిఎస్6 ఇప్పుడు కొత్త రంగులో; త్వరలో విడుదల!

మహీంద్రా మోజో బిఎస్6 కొత్త కలర్ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్‌లో రానున్న మహీంద్రా మోజో బిఎస్6 మోటార్‌సైకిల్ ఖచ్చితంగా కొనుగోలుదారులను ఆకట్టుకుందని మా అభిప్రాయం. కొత్త కలర్ స్కీమ్‌తో తయారైన మోజో 300 బిఎస్6 మోడల్ ఖచ్చితంగా అందంగా కనబడేలా చేస్తుంది, చూసిన వెంటనే కొనాలనిపించేలా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని మాకు తెలిసిన వెంటనే మీ ముందుకు తీసుకువస్తాము!

Most Read Articles

English summary
Mahindra Two-Wheelers is inching closer towards launching the Mahindra Mojo BS6 models, and has released a second image of the upcoming motorcycle via its social media channels. The brand recently released its first teaser of the Mojo BS6. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X