Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 2 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Movies
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్6 వెర్షన్ వచ్చేసింది: ధర రూ. 8.69 లక్షలు
భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్6 వెర్షన్ డీజల్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్ 6 ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో మహాంద్రా తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు ఏదంటే.. ఇక మీదట బీఎస్6 వెర్షన్లో లభించే W8 వేరియంట్‌ను ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లో పరిచయం చేసింది. ఇది వరకూ W6 మరియు W8(O) వేరియంట్లో మాత్రమే లభించే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇకపై W8లో కూడా లభించనుంది.

మహీంద్రా కథనం మేరకు, మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్6 కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 115బిహెచ్పి పవర్ మరియు 117ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్6 ఎస్‌యూవీలో ఎలాంటి ఫీచర్లు తీసుకొచ్చారనేది ఇంకా వెల్లడించలేదు. డ్యూయల్-టోన్ క్యాబిన్, 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బీఎస్4 మోడల్లో లభించే అన్ని ఫీచర్లను యధావిధిగా ఇందులో తీసుకొచ్చారనేది సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బీఎస్6 పెట్రోల్ ఇది వరకే మార్కెట్లోకి విడుదలయ్యింది. తాజాగా డీజల్ వేరియంట్లు కూడా బీఎస్6 వెర్షన్లో రావడంతో ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ300 అన్ని వేరియంట్లు బీఎస్6 వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి.

మహీంద్పా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. మహీంద్రా ఎమ్‌స్టాలియన్ ఇంజన్ ఫ్యామిలీలో అభివృద్ది చేసిన గ్యాసోలిన్ డైరక్ట్ ఇంజెక్షన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఈ స్పోర్ట్ వేరియంట్లో పరిచయం చేశారు.

ఈ స్పోర్ట్ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్‌తో పోల్చుకుంటే 20బిహెచ్పి ఎక్కువ పవర్ మరియు 30న్ఎమ్ అధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరికొన్ని నెలల్లో ఈ ఇంజన్ బీఎస్6 వెర్షన్లో లాంచ్ కానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏడు విభిన్న బీఎస్6 వేరియంట్లలో లభ్యమవుతోంది. ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.69 లక్షలు మరియు హై-ఎండ్ ధర రూ. 12.69 లక్షలు, ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఇది మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మోడళ్ల గట్టి పోటీనిస్తుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అన్నింటికంటే ముందుగా, అత్యంత సరసమైన ధరలో బీఎస్6 వేరియంట్లను అందుబాటులోకి తెచ్చినందుకు మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే, NOx ట్రాప్ సిస్టమ్ వివియోగించి ఉంటే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ ఎక్స్‌యూవీ300 ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు ఇది నిజంగానే శుభవార్త.