ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

బజాజ్ ఆటో భారతదేశానికి పరిచయం చేసిన ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ కెటిఎమ్‌కు ఇక్కడి మార్కెట్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ బ్రాండ్ అందిస్తున్న కెటిఎమ్ ఆర్‌సి 200 మోటార్‌సైకిల్ చాలా పాపులర్ అయింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కెటిఎమ్ మోడళ్లలో ఇది కూడా ఒకటి. చాలా మంది కెటిఎమ్ ఆర్‌సి 200 యజమానులు తమ మోటార్‌సైకిల్‌ను అలాగే ఉంచాలని ఎంచుకున్నప్పటికీ, కొందరు మాత్రం మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసుకోవాలనుకుంటారు.

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఓ పోస్ట్‌లో కస్టమైజ్డ్ కెటిఎమ్ ఆర్‌సి 200 మోటార్‌సైకిల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. the_demonspeed అనే అకౌంట్ నుండి కేరళకు చెందిన ఓ కెటిఎమ్ ఆరే‌సి 200 యజమాని, తన మోటార్‌సైకిల్‌లో అనేక మార్పులు చేర్పులు చేసి ఈ మోడల్‌ను మోటోజిపి మెషీన్ లాగా మార్చారు.

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

జెడ్ వన్ అని పిలువబడే బైక్ కస్టమైజేషన్ కంపెనీ ఈ కెటిఎమ్ ఆర్‌సి 200 మోటార్‌సైకిల్‌కు మంచి వ్రాప్ జాబ్ చేసి, దీనిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. బ్లూ అండ్ వైట్ కలర్ బాడీ పెయింట్ స్కీమ్‌తో పాటుగా బైక్‌లో అక్కడక్కడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ చేస్తూ అనేక డిజైన్ అంశాలతో దీనిని కస్టమైజ్ చేశారు. కెటిఎమ్ సిగ్నేచర్ కలర్ అయిన ఆరెంజ్, బైక్‌పై అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, తొలిచూపులో దీనిని కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్ అని గుర్తు పట్టడం కష్టంగా ఉంటుంది.

MOST READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

వివిధ మోటర్‌స్పోర్ట్‌లలో స్పాన్సర్‌లుగా ఉన్న ప్రముఖ బ్రాండ్‌లతో ఈ బాడీ ప్యానెళ్లను డిజైన్ చేశారు. ఎల్ఫ్, అక్రపోవిక్, మోటోరెక్స్, ట్రాక్‌స్పెక్ మోటార్‌స్పోర్ట్స్, రెడ్‌బుల్ ఆర్గానిక్స్ కొన్ని ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లను దీనిపై చూడొచ్చు.

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ మోటార్‌సైకిల్‌లో పూణేకి చెందిన ఆటోలాగ్ డిజైన్ నుండి గ్రహించిన కొన్ని ఉత్పత్తులను ఉపయోగించారు. ఇందులో ట్రాక్ స్పెక్ టెయిల్ (రూ.5,500 ధర) మరియు రేస్ బెల్లీ (రూ.4,000 ధర) ఉన్నాయని చిత్రాలను చూస్తుంటే తెలుస్తోంది.

MOST READ:మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

ఇందులోని ఇతర ముఖ్యాంశాలలో క్లియర్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఫ్రంట్ వైజర్, సింగిల్ సీట్ కాన్ఫిగరేషన్ వంటి మార్పులను చూడొచ్చు.

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

ఇకపోతే కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 199.5 సిసి ఇంజన్‌ గరిష్టంగా 25.1 బిహెచ్‌పి శక్తిని మరియు 19.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ మోటారుసైకిల్ ముందు భాగంలో డబ్ల్యూపి అపెక్స్ 43 సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో డబ్ల్యూపి అపెక్స్ మోన్-షాక్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో 300 మి.మీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 230 మి.మీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇందులో స్లిప్పర్ క్లచ్ మరియు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

కెటిఎమ్ ఆర్‌సి 200 మోడల్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.2.01 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయించబడుతోంది. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, హ్యోసంగ్ జిటి250ఆర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ మరియు సుజుకి జిక్సెర్ ఎస్ఎఫ్250 లతో పోటీపడుతుంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని కొత్త మోడిఫైడ్ డీజిల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ మోడిఫైడ్ కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మార్కెట్లో ఇప్పటికే కొన్ని మోడిఫైడ్ కెటిఎమ్ ఆర్‌సి 200 మోడళ్లు ఉన్నప్పటికీ, మేము చూసిన వాటిలో మాత్రం ఇది చాలా ఉత్తమంగా ఉందని చెప్పవచ్చు. ఎటువంటి గందరగోళం లేకుండా, మంచి రంగు కలయికతో తయారు చేసిన ఈ మోటార్‌సైకిల్ చూడటానికి రేస్ బైక్‌లా అనిపిస్తుంది.

Image Courtesy: the_demonspeed/Instagram

Most Read Articles

English summary
modified ktm rc 200 by zed one. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X