సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ ఎమ్‌వి అగస్టా స్లోవేనియన్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ (స్పోర్ట్స్ బైక్స్, రేస్ బైక్‌లలో ఉపయోగించే సైలెన్సర్స్) లను తయారు చేసే అక్రపోవిక్ కంపెనీతో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా, భవిష్యత్తులో ఎమ్‌వి అగస్టా తయారు చేసే ప్రీమియం మోటార్‌సైకిళ్లలో అక్రపోవిక్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్‌లను ఉపయోగించనున్నారు.

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఈ సైలెన్సర్లలో టైటానియం మరియు కార్బన్ ఫైబర్ భాగాలను ఉపయోగిస్తారు. ఎమ్‌వి అగస్టా కోరిన డిజైన్‌కు అనుగుణంగా అక్రపోవిక్ ఈ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్‌లను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది.

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ బీటింగ్ సౌండ్) ఎల్లప్పుడూ ‘ఎమ్‌వి అగస్టా అనుభవంలో' భాగమేనని ఎమ్‌వి అగస్టా సిఈఓ తైమూర్ సర్దరోవ్ పేర్కొన్నారు. ఎమ్‌వి అగస్టా దాని ఇన్‌లైన్-త్రీ మరియు ఇన్‌లైన్-ఫోర్ సిరీస్ ఉత్పత్తులలో వాటి లుక్స్ అండ్ సౌండ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

MOST READ:ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎందుకో తెలుసా

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

అయితే, అక్రపోవిక్‌తో కొత్తగా ఏర్పరుచుకున్న ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఎగ్జాస్ట్ సౌండ్‌కు మరింత అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఇదివరకటి కన్నా మరింత మెరుగైన సౌండింగ్‌తో సైలెన్సర్లను అందించాలని ఎమ్‌వి అగస్టా లక్ష్యంగా పెటుకుంది. ఈ రెండు బ్రాండ్లు "ఉత్తమమైనవి తప్ప మరేమీ అంగీకరించబడవు" అనే విధానాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తాయి.

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఈ ఒప్పందంపై అక్రపోవిక్ సిఈఓ ఉరోస్ రోసా వ్యాఖ్యానిస్తూ, ఈ కూటమి మోటార్‌సైకిల్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు. ఓఈఎమ్ నిర్దిష్ట ఎగ్జాస్ట్‌లు ఇంతకు ముందెన్నడూ చూడని డిజైన్లను కలిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

MOST READ:ఇది చూసారా.. హ్యుందాయ్ షోరూమ్ రిసెప్షనిస్ట్‌గా వీధి కుక్క

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఈ ఒప్పందంలో భాగంగా, ఇరు కంపెనీలు అద్భుతమైన మోటార్‌సైకిల్ శబ్ద అనుభవాన్ని సృష్టించడంతో పాటు ఎమ్‌వి అగస్టా ‘మోటార్‌సైకిల్ ఆర్ట్' ఫిలాసఫీపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ఇటాలియన్ తయారీదారుల స్టైలింగ్ సూత్రాలను సంపూర్ణంగా పూర్తిచేసే "అందరికీ చూడటానికి మరియు వినడానికి ఇదొక స్టేట్‌మెంట్"లా ఉండేలా అక్రపోవిక్ వీటిని తయారు చేస్తుందని ఉరస్ వ్యాఖ్యానించారు.

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

ఈ ఇరు కంపెనీల వ్యవస్థాపకులు, కౌంట్ డొమెనికో అగస్టా మరియు ఇగోర్ అక్రపోవిక్ ఇద్దరూ కూడా మోటర్‌స్పోర్ట్ నేపథ్యం నుండి వచ్చినవారే. ఈ కారణంగానే, రెండు కంపెనీలకు మొదటి నుంచీ లోతుగా పాతుకుపోయిన ‘రేసింగ్ డిఎన్‌ఏ'ను మనం గమనించవచ్చు. ఎమ్‌వి అగస్టా నుండి రాబోయే రేంజ్-టాపింగ్ మెషీన్ల కోసం అక్రపోవిక్ రేస్-స్పెసిఫిక్ నాన్-రోడ్-లీగల్ సిస్టమ్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని సమాచారం.

MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

సైలెన్సర్ బ్రాండ్ అక్రపోవిక్‌తో చేతులు కలిపిన ఎమ్‌వి అగస్టా; ఎందుకో తెలుసా?

భారత్‌లో కొత్త డీలర్ నెట్‌వర్క్ భాగస్వామి కోసం ఎమ్‌వి అగస్టా అన్వేషణ

ఫిబ్రవరి 2020లో, ఎమ్‌వి అగస్టా ఇండియా పూణేకు చెందిన మల్టీ-బ్రాండ్ డీలర్ నెట్‌వర్క్ మోటోరోయల్ కైనెటిక్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించుకుంది. ఈ నేపథ్యంలో, భారతీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం కోసం కంపెనీ ఇప్పుడు కొత్త భాగస్వామితో చర్చలు జరుపుతోంది, వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఎమ్‌వి అగస్టా తమ బిఎస్6 మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
MV Agusta has join hands with Slovenian performance exhaust manufacturer Akrapovic to make some of the best-sounding motorcycles in the industry. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X