బిఎస్ 6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన మోడల్ బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్‌ను బీఎస్6 వెర్షన్‌లో అప్‌డేట్ చేసింది. ఇదే విషయాన్ని బజాజ్ డీలర్లు స్పష్టం చేశారు. ఇప్పటికే బీఎస్6 డామినర్ మీద బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు షోరూమ్ ప్రతినిధులు తెలిపారు.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బీఎస్4 బజాజ్ డామినర్ 400 ధర రూ. 1,90,002లుగా ఉండగా, లేటెస్ట్ వెర్షన్ బీఎస్6 డామినర్ ధర స్పల్పంగా (రూ. 1,749 ) పెరిగి రూ. 1,91,751 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. బీఎస్4 నుండి బీఎస్6 అప్‌గ్రేడ్ నేపథ్యంలో వివిధ టూ వీలర్ల కంపెనీలు తమ బైకుల ధరలు భారీగా పెంచాయి, కానీ బజాజ్ అత్యంత వ్యూహాత్మకంగా డామినర్ ధరలు నిర్ణయించింది.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

దేశవ్యాప్తంగా పలు బజాజ్ షోరూముల్లో ఇప్పటికే అనధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభమమయ్యాయి. ఔత్సాహిక కస్టమర్లు రూ. 1000 నుండి రూ. 5000 మధ్య బుకింగ్ అమౌంట్ చెల్లించి బీఎస్6 బజాజ్ డామినర్ బైకును బుక్ చేసుకోవచ్చు.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

విడుదల విషయానికి వస్తే, బజాజ్ డామినర్ 400 బీఎస్6 ఫిబ్రవరి చివరికి లేదా మార్చి ప్రారంభంనాటికల్లా విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. బీఎస్6 అప్‌గ్రేడ్ మినహాయిస్తే సాంకేతికంగా, కాస్మొటిక్స్ మరియు బాడీ పెయింట్ స్కీమ్స్ విషయంలో ఎలాంటి మార్పులు జరగడం లేదు.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతానికైతే, బీఎస్6 డామినర్ 400 ఇంజన్ సీసీ, పవర్ అవుట్‌పుట్ వంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, కెటిఎమ్ 390 డ్యూక్ తరహాలో పర్ఫామెన్స్ ఇవ్వడంలో డామినర్ 400 గట్టి పోటీనిస్తుంది. బహుశా ఇది 40బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

బీఎస్6 బజాజ్ డామినర్ 400 బైకులో అదే మునుపటి సస్పెన్షన్ సిస్టమ్ రాబోతోంది, ముందు వైపున అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఇరువైపులా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ గల డిస్క్ బ్రేకులు వచ్చాయి.

బీఎస్6 బజాజ్ డామినర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా..?

రెండు లక్షల బడ్జెట్ ధరలో బెస్ట్ స్ట్రీట్ ఫైటర్‌గా బజాజ్ డామినర్ మంచి సక్సెస్ సాధించింది. ఇది మార్కెట్లో ఉన్న జావా, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు మోజో 300 బైకులకు పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
New Bajaj Dominar 400 bs6 launched in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X