భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

బిఎమ్‌డబ్ల్యూ మోటొరాడ్ ఇండియా కొత్త ఎస్ 1000 ఎక్స్‌ఆర్ స్పోర్ట్ టూరర్‌ బైకుని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ స్పోర్ట్ టూరర్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ మోడల్ బ్రాండ్ యొక్క ప్రసిద్ధ స్పోర్ట్ బైక్, ఎస్ 1000 ఆర్ పై ఆధారపడింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

ఈ నెల 16 న బిఎమ్‌డబ్ల్యూ తన కొత్త మోటొరాడ్ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ ను గత సంవత్సరం EICMA వద్ద ఆవిష్కరించారు. ఈ బైక్ కొత్త టెక్నాలజీని కలిగి ఉండటమే కాకుండా అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. 2020 ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్ 2 స్టేజెస్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ బాడీవర్క్ మరియు కొత్త హెడ్‌లైట్లు కలిగి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

అంతే కాకుండా మెరుగైన పనితీరు కోసం ఇంజిన్ తిరిగి ట్యూన్ చేయబడింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌లో 999 సిసి ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 164 బిహెచ్‌పి మరియు 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 114 హెచ్‌పి టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్ అసిస్టెడ్ క్లచ్‌కు జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ; అవి ఏ వాహనాలో తెలుసా ?

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌ మునుపటి మోడల్ కంటే 3,000 ఆర్‌పిఎమ్ అధికంగా అందించడానికి ఇంజిన్ ట్యూన్ చేయబడింది. ఈ బైక్ ముందు భాగంలో 45 మిమీ యుఎస్డి ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ అమర్చారు.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం గమనించినట్లయితే దీని ముందు భాగంలో 320 మిమీ ట్విన్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 265 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో కూడా వస్తుంది.

MOST READ:భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ ధర రూ. 18 లక్షలు. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్ ఈ నెలలో భారత్‌లో లాంచ్ అవుతుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే కవాసకి వెర్సిస్ 1000 మరియు డుకాటీ మల్టీస్ట్రాడా 1260 ఎస్ లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భర్తతో గొడవ.. నడిరోడ్డులో రేంజ్ రోవర్ కారుపైకెక్కిన భార్య, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

Most Read Articles

English summary
BMW S 1000 XR Launch On July 16, 2020. Read in Telugu.
Story first published: Wednesday, July 15, 2020, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X