Just In
Don't Miss
- Lifestyle
పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆశ్చర్యం కలిగిస్తుంది!!
- News
నిమ్మగడ్డ టీమ్‌లో మరో కొత్త అధికారి- ఐజీ సంజయ్ పాత్ర ఏంటి ? ఏకగ్రీవాల్ని అడ్డుకోగలరా ?
- Movies
‘మాస్టర్’ కలెక్షన్లపై పెద్ద దెబ్బ.. ‘ఆహా’కు అమెజాన్‌కు తేడా అదే
- Sports
India vs England: చెన్నై చేరుకున్న రోహిత్, రహానే, శార్దూల్
- Finance
పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ విడుదల - ధర, ఫీచర్లు
జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తమ సరికొత్త 2020 ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రో అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ ఒకే వేరియంట్ (ప్రో)లో మాత్రమే లభ్యం కానుంది. దేశీయ విపణిలో ఈ మోడల్ ధర రూ.20.90 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

ఈ కొత్త మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. వినియోగదారులు ఆన్లైన్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రో ఇప్పుడు బిఎస్6 కంప్లైంట్ 999 సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 163 బిహెచ్పి శక్తిని మరియు 9250 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ఈ మోటార్‌సైకిల్‌లోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 45 మి.మీ యుఎస్డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక వైపు డబుల్ సైడెడ్ స్వింగార్మ్‌తో కూడిన మోనో-షాక్ సెటప్ ఉంటాయి. ఇందులో డైనమిక్ ఈఎస్ఏ (ఎలక్ట్రానిక్ సెల్ఫ్ అడ్జస్టబల్ రీబౌండ్ / డ్యాపింగ్) కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది. ముందు మరియు వెనుక సస్పెన్షన్ రెండూ కూడా 150 మి.మీ ట్రావెల్‌ని కలిగి ఉంటాయి. దీనికి రెండు వైపురా 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రెండు 320 మి.మీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే ఒక 265 మి.మీ డిస్క్ ఉంటుంది. ఇది డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ని సపోర్ట్ చేస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్లో స్లిప్పర్ క్లచ్, కార్నరింగ్ ఏబిఎస్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్-స్టెబిలిటీ కంట్రోల్, మోటార్-స్లిప్ రెగ్యులేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ (రెయిన్, రోడ్, డైనమిక్ మరియు డైనమిక్ ప్రో) కూడా ఉంటాయి.
MOST READ:స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర స్టాండర్డ్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డిఆర్ఎల్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 6.5 ఇంచ్ టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, పన్నీర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ రెండు కొత్త కలర్ ఆప్షన్లల (రేసింగ్ రెడ్ మరియు ఐస్ గ్రే) లభిస్తుంది.

కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా మాట్లాడుతూ, "సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. పవర్ ప్యాక్డ్ ఇంజన్‌తో నిజమైన రేస్ట్రాక్ అనుభూతిని కలిగిస్తుంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇంజన్, రాజీలేని ఎర్గోనామిక్స్‌తో, ఇది విస్మయం కలిగించే పనితీరును, స్పోర్టీ రైడ్ అనుభూతిని అందిస్తుంద"ని అన్నారు.
MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]

కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రో మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఎఫ్ 900 ఎక్స్ఆర్ విడుదలైన దాదాపు నెల తరువాత కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రో భారత మార్కెట్లో విడుదలైంది. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నుంచి వచ్చిన ఈ కొత్త (2020) ఎస్ 1000 ఎక్స్ఆర్ భారత మార్కెట్లో కవాసాకి వెర్సిస్ 1000 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.