ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఆంపియర్ ఎలక్ట్రిక్, ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మరిన్ని కొత్త వేరియంట్లను విడుదల చేసింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త వేరియంట్లు మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి అనేక అప్‌డేట్‌లను కలిగి ఉన్నాయని తెలిపింది.

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ ఎలక్ట్రిక్ అందిస్తున్న రియో, మాగ్నస్, జీల్ మరియు వి48 అనే ప్రోడక్ట్ లైనప్‌లో కంపెనీ కొత్త వేరియంట్‌లను జోడించింది. ఈ కొత్త వేరియంట్ మోడల్‌ను బట్టి అదనపు ఫీచర్లు, అధిక రేంజ్ (మైలేజ్) మరియు మెరుగైన లోడ్ సామర్థ్యాసను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ విడుదల చేసిన కొత్త వేరియంట్లు ఇప్పుడు మెరుగైన మైలేజ్ మరియు ఫీచర్లతో భారతదేశంలో 180కి పైగా నగరాలు మరియు పట్టణాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆంపియర్ డీలర్‌షిప్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. తాజాగా విడుదలైన కొత్త వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

Ampere Variant Price
Reo Plus ₹42,490
Reo Elite ₹42,999
V48 Plus ₹36,190
Magnus 60 (Slow speed) ₹49,999
Zeal Ex ₹66,949

MOST READ:మీకు తెలుసా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఇదే

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ రియో ​​మోడల్ ఇప్పుడు వేర్వేరు బ్యాటరీ టెక్నాలజీతో రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది. కొత్త వేరియంట్లో ఇప్పుడు యుఎస్‌బి మొబైల్ ఛార్జింగ్ మరియు ఇగ్నిషన్ స్టార్ట్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ ఎలైట్ మోడల్ రేంజ్ ఇప్పుడు ఇప్పుడు మరింత మెరుగైన లోడ్ సామర్థ్యం మరియు మెరుగైన మైలేజీతో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు లిథియం అయాన్ లేదా లీడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఇవి ఒకే ఛార్జ్‌లో గరిష్టంగా 65 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను కలిగి ఉంటాయి.

MOST READ:ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ నుండి అత్యంత పాపులర్ అయిన జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 10 శాతం ఎక్కువ మైలేజ్ మరియు సున్నితమైన పవర్ డెలివరీని అందించే విధంగా అప్‌గ్రేడ్ చేయబడింది. మరోవైపు, బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ వి48 ఇప్పుడు గ్రామీణ మార్కెట్ల కోసం మరింత మెరుగైన విజిబిలిటీ మరియు సౌలభ్యం కోసం ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ట్యూబ్‌లెస్ టైర్లతో అమర్చబడి ఉంటుంది.

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఈ కొత్త వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, ఆంపియర్ ఎలక్ట్రిక్ సిఓఓ పి సంజీవ్ మాట్లాడుతూ, "భారతదేశం క్లీన్ మొబిలిటీ వైపు పరివర్తన చెందుతోంది మరియు ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ విషయంలో మా కస్టమర్లు, ఫ్యాన్ గ్రూపులు మరియు ఛానల్ భాగస్వాములను మేము శ్రద్ధగా ఆలకిస్తున్నాము" అని అన్నారు.

MOST READ:గుడ్ న్యూస్.. థార్ యాక్సెసరీస్ ప్యాక్ వెల్లడించిన మహీంద్రా

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

"గరిష్ట మైలేజ్‌కి ప్రాధాన్యత ఇచ్చే మార్కెట్‌లో, సగటు కస్టమర్‌కు పూర్తి ఛార్జీకి ఎక్కువ దూరం వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో అవసరం. అందుకే మేము ఈ కొత్త శ్రేణి మోడళ్లను ప్రవేశపెడుతున్నాం. ఇవి బి 2 సి మరియు బి 2 బి కస్టమర్ల అవసరాన్ని ఖచ్చితంగా తీరుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ కొత్త ఉత్పత్తులు సరికొత్త టెక్నాలజీతో రూపొందించబడ్డాయి మరియు ఇవి ధరకు తగిన విలువను అందిస్తాయని" ఆయన చెప్పారు.

ఆంపియర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల - ధర, మైలేజ్, వివరాలు

ఆంపియర్ కొత్త స్కూటర్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆంపియర్ కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లు ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లను మరియు ఎక్కువ రేంజ్ (మైలేజ్)ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఆంపియర్ ఈ కొత్త మోడళ్లను విడుదల చేసినట్లు తెలుస్తోది. కస్టమర్లకు కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి సంస్థ ఆకర్షణీయమైన ఓనర్‌షిప్ మోడళ్లను కూడా అందిస్తోంది.

MOST READ:టయోటా హిలక్స్ వుడ్ స్కేల్ మోడల్.. ఇది నిజంగా సూపర్ గురూ..!

Most Read Articles

English summary
Indian electric two-wheeler manufacturer, Ampere Electric, has launched new variants of its existing electric scooter range. According to the company, the new variants features several improvements to enhance the overall riding experience and providing more comfort to customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X