కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ కెటిఎమ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' మోటార్‌సైకిల్ కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్‌ని ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ రూ.6,999 నుంచి ప్రారంభమయ్యే ఈఎమ్ఐలను అందిస్తోంది. ఈ కొత్త ఆఫర్‌తో కొనుగోలుదారులు ఇప్పుడు సులభంగా ఈ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవచ్చు.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్ ప్రకటించిన ఈ కొత్త ఫైనాన్స్ పథకంలో తక్కువ ఈఎమ్ఐతో పాటుగా, ద్విచక్ర వాహనాలపై ఆన్-రోడ్ ధరలపై 80 శాతం వరకు రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ రుణాన్ని ఐదేళ్ల కాలపరిమితికి ఆఫర్ చేయటం జరుగుతోంది. భారత మార్కెట్లో కెటిఎమ్‌ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధర రూ.3.04 లక్షలు, ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంస్థలు కూడా ఆన్-రోడ్ ధరలో 95 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నాయని, కస్టమర్లు కావాలనుకుంటే వాటిని కూడా ఎంచుకునే సౌలభ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ఆప్షన్లను కూడా కెటిఎమ్ అందిస్తోంది. వీటికి అదనంగా, కస్టమర్లు కెటిఎమ్ డీలర్‌షిప్‌లలో తమ పాత మోటార్‌సైకిల్‌ను మార్పిడి చేసుకుంటే వాటిపై అదనపు రాయితీలను కూడా అందిస్తోంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్‌ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 373.2 సిసి, సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 43 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. క్లచ్ రహిత అప్ అండ్ అన్ షిఫ్ట్స్ కోసం ఈ ఇంజన్ స్లిప్పర్ అసిస్టెడ్ క్లచ్ మరియు క్విక్-షిఫ్టర్ టెక్నాలజీతో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు, ఇది లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ముందు భాగంలో, ఇది 170 మిమీ ప్రయాణంతో డబ్ల్యూపి అపెక్స్ 43 మిమీ యూఎస్‌డి ఫోర్కులు మరియు వెనుకవైపు 177 మిమీ ట్రావెల్‌తో డబ్ల్యూపి అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్‌ సెటప్ కలిగి ఉంటుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్‌లు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇందులో ముందు వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మెట్జెలర్ టూరెన్స్ డ్యూయల్ పర్పస్ టైర్లతో వస్తుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్‌లో అనేక పరికరాలు మరియు రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం కెటిఎమ్‌ ‘మై రైడ్' కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద టిఎఫ్‌టి డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌పల్స్ 200, బిఎమ్‌డబ్ల్యూ జిఎస్310 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

ఈ కొత్త ఫైనాన్స్ ఆఫర్లపై బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, "మా విస్తరిస్తున్న పోర్ట్‌ఫోలియోకు కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఒక కీలకమైన మోడల్‌గా మారింది. ఈ మోడల్‌ను ప్రారంభించినప్పటి నుండి మార్కెట్లో అద్భుతమైన ప్రతిస్పందనను చూసింది. బైకింగ్ ఔత్సాహికులకు ఇది నిజంగా సమర్థవంతమైన మరియు విశిష్టమైన అడ్వెంచర్ టూరర్‌ను అందించే వాగ్దానాన్ని నిలుపుకుంటుంద"ని అన్నారు.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

"కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ఇప్పటికే చాలా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నప్పటికీ, మరింత ఎక్కువ మంది బైకింగ్ ఔత్సాహికులకు దీనిని దగ్గర చేసేందుకు ఈ కొత్త ఫైనాన్స్ పధకాలను ప్రారంభించాం. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి భాగస్వాములతో కలిసి సృష్టించబడిన ఈ ఫైనాన్స్ పథకాల ద్వారా చాలా మంది కస్టమర్లను ఈ ప్రీమియం బైక్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి ప్రేరేపిస్తుందని భావిస్తున్నామ"ని అన్నారు.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం స్పెషల్ ఆఫర్స్ - వివరాలు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ కోసం ప్రకటించిన ఫైనాన్స్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కెటిఎమ్ తమ పవర్‌ఫుల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను మరింత మంది కస్టమర్లకు చేరువ చేసేందుకు అనేక రకాల ఫైనాన్స్ పథకాలను అందిస్తోంది. ఇందులో తక్కువ ఈఎమ్ఐ నుండి 95 శాతం ఆన్-రోడ్ ఫండింగ్ వంటి ఆఫర్లు ఉన్నాయి. కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ టూరింగ్, సిటీ మరియు ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రైడర్ భద్రత కోసం ఇందులో అనేక ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 28, 2020, 11:57 [IST]
English summary
KTM India has announced new finance schemes for the 390 Adventure motorcycle in the Indian market. The company is offering EMIs starting at as low as Rs 6,999, which will make it easier for buyers to own the motorcycle. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+