500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా స్థానికంగా తయారు చేసిన మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్లను త్వరలో భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తోంది. హోండా కంపెనీ తన 500 సిసి మోటార్‌సైకిళ్ల తయారీని తన ప్రత్యర్థులపై పోటీగా ధర నిర్ణయించడానికి స్థానికీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

హోండాలో 500 సిసి మోటార్‌సైకిళ్ల సమగ్ర లైనప్ ఉంది. ఇందులో సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ టూరర్, సిఎమ్‌ఎక్స్ 500 రెబెల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్, సిబిఆర్ 500 ఆర్ ఫుల్-ఫెయిర్డ్ మిడ్-వెయిట్ స్పోర్ట్స్ బైక్ మరియు సిబి 500 ఎఫ్ నేకెడ్ మోటార్‌సైకిల్ వంటివి ఉన్నాయి. భారతీయ మార్కెట్లోకి 500 సిసి మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టడంతో, హోండా ప్రస్తుతం దేశంలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల శ్రేణిలో సిబి 300 ఆర్ మరియు సిబిఆర్ 650 ఆర్ మధ్య అంతరాన్ని పూరించాలనుకుంటుంది.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

హోండా సిబిఆర్ 1000 ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్, సిబి 1000 ఆర్, గోల్డ్‌వింగ్ మరియు ఫోర్జా వంటి మోటార్ సైకిల్స్ ని సిబియు మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది మరియు విక్రయిస్తుంది. అంతే కాకుండా సంస్థ ఇప్పుడు స్థానికంగా లభించే భాగాలను ఉపయోగించి కొన్ని ప్రీమియం మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

దేశీయంగా తయారు చేయబడిన మోటార్‌సైకిళ్లతో పోలిస్తే సికెడి మరియు సిబియు మోటార్‌సైకిళ్లు గణనీయమైన పన్నులను ఆకర్షిస్తాయి. భారతదేశంలో తయారీ సంస్థ వారి ప్రీమియం మోటార్‌సైకిళ్లన ధర నిర్ణయించడంలో సహాయపడుతుంది. స్థానికంగా తయారుచేసే బైక్‌ను మొదట లాంచ్ చేయబోతున్నట్లు హోండా వెల్లడించకపోయినప్పటికీ, ఇది మిడ్-వెయిట్ మోటార్‌సైకిల్ అని వారు ధృవీకరించారు.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

హోండా తన ప్రీమియం బైక్‌లపై 100 శాతం స్థానికీకరణను పరిశీలిస్తోంది. అంటే ఫ్రేమ్, చక్రాలు, టైర్లు, సస్పెన్షన్, ఇంజిన్ వంటి సమగ్ర భాగాలను భారతీయ అమ్మకందారుల నుండి సేకరించిన భాగాలను ఉపయోగించి తయారు చేస్తారు.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

హోండా తన మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్లను స్థానికీకరించాలని యోచిస్తుండగా, సిబి 300 ఆర్ భారతదేశంలో కూడా అదే ఉత్సాహాన్ని పొందగలదా అని వేచి చూడాలి. ఇవి కొంత ఎక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ కంపెనీ వీటిని బాగా తయారు చేసింది.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

సిబి 300 ఆర్ అద్భుతమైన ఉత్పత్తి. దీని ధరను గమనించినట్లయితే ఇది దాదాపు రూ. 2.41 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. 2019 నుండి ప్రీమియం బైక్ అమ్మకాలు 400 శాతం పెరగడానికి సిబి 300 ఆర్ ఒక ప్రధాన కారణమని కంపెనీ ధృవీకరిస్తుంది. స్థానిక ఉత్పత్తితో సిబి 300 ఆర్ ఖర్చు గణనీయంగా పడిపోతుంది. అంతే కాకుండా ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.

500 సిసి మోటార్ సైకిల్స్ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభించనున్న హోండా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో ద్విచక్ర వాహన విభాగంలో హోండా ప్రఖ్యాతిగాంచిన కంపెనీ. ఇది భారతదేశంలో మంచి అమ్మకందారులలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు హొండా సంస్థ తన ప్రీమియం మోటారుసైకిల్స్ 100% స్థానికీకరణను సాధించాలని యోచిస్తోంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda 500cc Motorcycles Local Manufacturing To Start Soon In India Launch By 2021. Read in Telugu.
Story first published: Wednesday, March 11, 2020, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X