కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారత మార్కెట్లో మరో కొత్త బిఎస్ 6 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమ కొత్త 'హోండా లివోట' బిఎస్ను6 వెర్షన్‌కు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. వచ్చే నెలలో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

హోండా ఇటీవలే తమ సరికొత్త గ్రాజియా 125 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా మొత్తం 125సీసీ మోడళ్లంటినీ కంపెనీ బిఎస్6 కి అప్‌డేట్ చేసింది. హోండా ప్రస్తుతం సిడి110 డ్రీమ్ బిఎస్ 6 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా.. ఈ జాబితాలోకి తాజాగా హోండా లివో బిఎస్6 వచ్చి చేరనుంది.

కొత్త 2020 హోండా లివో మోటార్‌సైకిల్‌లో చేసిన కొన్ని మార్పులను హోండా ఈ టీజర్ వీడియోలో రివీల్ చేసింది. సిడి110 డ్రీమ్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన అదే బిఎస్6 ఇంజన్‌ను ఈ కొత్త హోండా లివో మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఈ ఇంజన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తోంది.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : ఆటోస్‌లో ప్రొటెక్టివ్ స్క్రీన్ అమలు చేసిన ఓలా

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

ఇందులోని 109.51సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 7500rpm వద్ద గరిష్టంగా 8.7bhp శక్తిని మరియు 5500rpm వద్ద 9.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేని నేపథ్యంలో, కొత్త లివో బిఎస్6 మోటార్‌సైకిల్‌కు కూడా ఇలాంటి గణాంకాలనే కలిగి ఉంటుందని అంచనా.

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

ఇకపోతే, హోండా లివోలో అప్‌డేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి, ఇవి యువకులను మరింత ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. టీజర్ వీడియోలో చూపినట్లుగా, ఈ బైక్ ముందు భాగంలో ఆప్షనల్ డిస్క్ బ్రేక్, ఎసిజి స్టార్టర్ మరియు ఇంజన్ కిల్ స్విచ్, చక్కగా అమర్చబడిన అప్‌డేట్ చేసిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడి ఆప్షన్ లేని హాలోజన్ హెడ్‌లైట్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

MOST READ: ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

హోండా లివో మోటారుసైకిల్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్, వెనుక భాగంలో ట్విన్-షాక్ హైడ్రాలిక్ సెటప్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ఇక బ్రేకింగ్ సిస్టమ్‌ను గమనిస్తే, ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్స్‌తో పాటుగా ఆప్షన్లల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మోటారుసైకిల్‌లో ఎత్తు పెంచిన హ్యాండిల్‌బార్ ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేయనుంది.

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

హోండా లివో బిఎస్6 మార్కెట్లో విడుదలైతే, దీని ప్రీమియం అప్‌గ్రేడ్స్ కారణంగా ఇది మునపటి కన్నా కాస్తం అధిక ధరకను కలిగి ఉండొచ్చని సమాచారం. భారత మార్కెట్లో ఇది ఈ సెగ్మెంట్లోని టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హీరో ప్యాషన్ ప్రో మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ: ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

కొత్త లివో బిఎస్6 టీజర్‌ను ఆవిష్కరించిన హోండా, త్వరలో విడుదల!

హోండా లివో 2020 టీజర్ వీడియో‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో హోండా క్రమక్రమంగా తమ మోడళ్లను బిఎస్6 ఇంజన్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే సిడి డ్రీమ్ 110 మోడల్‌ను బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసిన హోండా తాజాగా లివోను కూడా బిఎస్6కు మారుస్తోంది. యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని వస్తున్న ఈ ఎంట్రీలెవల్ మోటార్‌సైకిల్, ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ ప్రీమియం ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Most Read Articles

English summary
Honda Motorcycles & Scooters India (HMSI) is gearing up to launch a new BS6 motorcycle in the Indian market. The company has teased the upcoming BS6 Livo, that is expected to be launched sometime next month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X