బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా భారత మార్కెట్లో ప్రసిద్ధ యునికార్న్ మోటార్‌సైకిల్ యొక్క బిఎస్ 6 మోడల్ విడుదల చేసింది. కొత్త బిఎస్ 6 హోండా యునికార్న్ 160 ధర ఇప్పుడు రూ. 93,593 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ ) తో అందించబడుతోంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త యునికార్న్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

హొండా కంపెనీ యొక్క 150 మోడల్ నిలిపి వేసి ఆ స్థానంలో కొత్త హొండా యునికార్న్ 160 ని ప్రవేశపెట్టారు. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగునంగా ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా 13,500 రూపాయల ఎక్కువ ధరను కలిగి ఉంది.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా సిఇఒ & మేనేజింగ్ డైరెక్టర్ 'మినోరు కటో' మాట్లాడుతూ హొండా కంపెనీ ప్రవేశపెట్టిన మొట్ట మొదటి మోటార్ సైకిల్ హోండా యునికార్న్. ఇది ప్రారంభించినప్పటినుండి ఇంజిన్ మంచి సామర్త్యాన్ని కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలను కలిగి ఉంది. దాదాపు 16 సంవత్సరాలుగా ఎంతో మన్నికైన వాహనంగా ప్రసిద్ధి చెందిందన్నారు.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

హోండా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాటాడుతూ ఈ బిఎస్-6 యునికార్న్ మోటార్ సైకిల్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా బాగా పని చేస్తుంది. ఇది బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కాకుండా వాహనదారుని చాలా అనుకూలంగా కూడా ఉంటుందని పేర్కొన్నాడు.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

కొత్త బిఎస్-6 యునికార్న్ అనేక కొత్త నవీనీకరణలను పొందింది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ క్రోమ్ ఆక్సెస్, నేమ్ ప్లేట్ కోసం ఆక్సెస్ లెటర్స్, 3 డి హోండా లోగో వంటివి ఇందులో ఉంటాయి. ఇది మునుపటి మోడల్ వలే సిగ్నేచర్ టైల్లైట్ పొందింది.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

అంతే కాకుండా ఇంజిన్ కిల్ స్విచ్, 8 మిమీ పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్, కొద్దిగా పెరిగిన ఎత్తైన సీటుతో పాటు, రోలింగ్ రెసిస్టెన్స్ ట్యూబ్ లెస్ టైర్లు, హెచ్ఇటి టెక్నాలజీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ మరియు సింగిల్-ఛానల్ ఎబిఎస్ లు ఉన్నాయి.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

కొత్త బిఎస్-6 హోండా యునికార్న్ 162 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 750 ఆర్పీఎమ్ వద్ద 12.7 బిహెచ్‌పి మరియు 5000 ఆర్పీఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. అంతే కాకుండా ఇంజిన్ పిజిఎం-ఫై టెక్నాలజీ మరియు హోండా ఎకో టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

నవీనీకరించిన కొత్త ఇంజిన్ మెరుగైన ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా వాహనదారుడు రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

హోండా యొక్క బిఎస్-6 యునికార్న్ ఇప్పుడు 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని కూడా అందిస్తుంది. ఈ ఆరు సంవత్సరాల వారంటీలో 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ, మరో మూడు సంవత్సరాలు ఆప్సనల్ వారంటీని కలిగి ఉంటుంది.

కొత్త యునికార్న్ మూడు విభిన్న రంగులలో లభిస్తుంది. అవి పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ & మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్.

బిఎస్-6 హోండా యునికార్న్ : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో బాగా ప్రాచుర్యం చెందిన మోటార్ సైకిల్స్ లో హోండా యునికార్న్ ఒకటి. ఇది మరింత మెరుగైన అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బిఎస్-6 హొండా యునికార్న్ మోటార్ సైకిల్ ప్రవేశపెట్టింది. హొండా సంస్థ ఈ కొత్త బిఎస్-6 మోటార్ సైకిల్ ప్రవేశపెట్టడం వాళ్ళ ఈ బ్రాండ్ మార్కెట్లో మరింత విజయాన్ని చేకూర్చడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, March 1, 2020, 11:00 [IST]
English summary
Honda Unicorn 160 BS6 Launched In India: Prices Start At Rs 93,593. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+