కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

కవాసకి తన 2021 నింజా 1000 ఎస్ఎక్స్ బైక్‌ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త నాల్గవ తరం కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ ధర రూ. 10.79 లక్షలు. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఏ కొత్త కవాసకి నింజా బైక్ గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ భారతదేశంలో మొట్టమొదటిగా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ప్రీమియం స్పోర్ట్-టూరర్. కొత్తగా నవీకరించబడిన 2021 నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ చాలా దూకుడుగా ఉంది. ఈ బైక్ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. కవాసకి బైకుల శ్రేణిలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఇది ఒకటి.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

2021 కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ పునర్నిర్మించిన ఎగ్జాస్ట్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ కొత్త కవాసకి బైక్ యొక్క రెండు చివర్లలోని ట్విన్-ఎగ్జాస్ట్ మరియు బైక్ యొక్క కుడి వైపున ఒకే ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది. 2021 కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్‌లో సైడ్ ప్యానెల్లు మరియు కొద్దిగా సవరించిన బెల్లీ పాన్ కూడా ఉన్నాయి.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

ఈ కొత్త బైక్, బైక్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కలిగి ఉండటమే కాకుండా, ఇందులో 4.3-అంగుళాల టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కలిగి ఉంది. ఈ బైక్‌లో ఎల్‌ఈడీ లైటింగ్ ఉంది. కొత్త నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ 4-టైప్స్ విండ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

2021 కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ యొక్క రైడర్ మరియు పిలియన్ రెండింటికీ నవీకరించబడిన ఎర్గోనామిక్స్ ఉన్నాయి. రైడర్ మరియు పిలియన్ సీట్లు మందంగా ఉన్నాయి. రైడర్ సీటు మొదటిదానికంటే వెడల్పుగా ఉంటుంది.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ 1,043 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పి శక్తిని, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 111 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

ఈ మార్పులు మరియు నవీకరణలు మాత్రమే కాకుండా కొత్త కవాసాకి నింజా 1000 ఎస్ఎక్స్ కొత్త ఎలక్ట్రానిక్స్ ఎంపికను కూడా కలిగి ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ థ్రాటిల్, ఎలక్ట్రానిక్ క్రూయిస్ కంట్రోల్, క్విక్-షిఫ్టర్, కార్నింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్ మరియు 3-స్టెప్ ట్రాక్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు

2021 కవాసాకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్ రెండు కలర్స్ ఎంపికలను కలిగి ఉంది. అవి మెటాలిక్ గ్రాఫైట్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ కార్బన్ గ్రే. ఇది చూటడానికి మంచి డిజైన్ మరియు స్టైల్ ని కలిగి ఉంటుంది. ఇది మొట్ట మొదటి ప్రీమియం స్పోర్ట్-టూరర్ బైక్.

More from DriveSpark

Article Published On: Saturday, May 30, 2020, 15:16 [IST]
English summary
2021 Kawasaki Ninja 1000SX BS6 Launched In India: Prices Start At Rs 10.79 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+