2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

సుజుకి మోటార్‌సైకిల్స్ బిఎస్ 6 కంప్లైంట్ ఇంట్రూడర్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త సుజుకి ఇంట్రూడర్ బిఎస్ 6 ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). సుజుకి యొక్క ఇంట్రూడర్ మోటార్ సిటీకి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

2020 సుజుకి ఇంట్రూడర్ బిఎస్ 6 మోడల్ మునుపటి మోడల్లో వుండే వైడ్ హ్యాండిల్‌బార్లు, బీఫీ ట్యాంక్, లో స్లాంగ్ డిజైన్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ సీట్లు మరియు డ్యూయల్ మఫ్లర్ ఎగ్జాస్ట్‌ వంటి వాటిని కలిగి ఉంటాయి. బిఎస్ 6 ఇంట్రూడర్ పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పిలియన్ కోసం స్మాల్ బ్యాక్‌రెస్ట్ కలిగి ఉంటుంది.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

ఈ కొత్త మోటార్ సైకిల్ చూడటానికి మునుపటి మోడల్ లాగా ఉంటుంది, దృశ్యమానం పరంగా ఎటువంటి మార్పు జరగలేదు. కానీ ఈ మోటార్ సైకిల్లో ఇంజిన్ మాత్రం బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించబడింది.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

కొత్త సుజుకి ఇంట్రూడర్ ఇప్పుడు అదే 154.9 సిసి సింగిల్ సిలిండర్ యూనిట్ యొక్క నవీకరించబడిన సంస్కరణతో వస్తుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

కొత్త సుజుకి ఇంట్రూడర్ బిఎస్ 6 ఇప్పుడు బ్రాండ్ యొక్క సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా వస్తుంది. కొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ మోటారుసైకిల్ మెరుగైన ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

2020 ఇంట్రూడర్ అనేది సుజుకి యొక్క మూడవ మోటారుసైకిల్ మరియు ఐదవ ఉత్పత్తి. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించబడింది. తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా సుజుకి ఇప్పటికే యాక్సెస్ 125 మరియు బర్గ్‌మన్ స్ట్రీట్లతో పాటు జిక్సెర్ మరియు జిక్సెర్ ఎస్ఎఫ్ మోటార్‌సైకిళ్లను నవీకరించింది.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

సుజుకి క్రూయిజర్ విభాగంలో ప్రవేశించిన ఇంట్రూడర్‌ శకాన్ని ప్రారంభించింది. ఇది వాహనదారులకు మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాకుండా లాంగ్ డ్రైవ్ చేయడానికి బెస్ట్ మోటార్ సైకిల్ ఈ ఇంట్రూడర్‌.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

కొత్త సుజుకి బిఎస్ 6 ఇంట్రూడర్ మూడు రంగు ఎంపికలలో అందించబడుతుంది. అవి మెటాలిక్ మాట్టే బ్లాక్ / కాండీ సనోమా రెడ్, గ్లాస్ మరుపు బ్లాక్ / మెటాలిక్ మాట్టే సిల్వర్ & మెటాలిక్ మాట్టే టైటానియం సిల్వర్.

2020 బిఎస్ 6 సుజుకి ఇంట్రూడర్ : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ సమర్పణలో ప్రసిద్ధమైన ఆఫర్‌లలో సుజుకి ఇంట్రూడర్ బిఎస్ 6 ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది భారతీయ మార్కెట్లో బ్రాండ్‌కు స్థిరమైన వాల్యూమ్ అమ్మకాలను తీసుకురావడానికి కంపెనీ కృషి చేస్తుంది. సుజుకి బిఎస్ 6 ఇంట్రూడర్ ధర ఇండియన్ మార్కెట్లో దాదాపు రూ 1.20 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2020 Suzuki Intruder BS6 Launched In India: Prices Start At Rs 1.20 Lakh. Read in Telugu.
Story first published: Saturday, March 21, 2020, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X