విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ ఇండియా తన కొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ వచ్చే వారం భారత మార్కెట్లో విడుదల కానుంది. మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

స్పోర్ట్ నేకెడ్ బైక్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ బైక్‌ ముందుగానే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కరోనావైరస్ భయం వల్ల స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ విడుదల కొంత ఆలస్యం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను విడుదల చేయడానికి కంపెనీ ఇప్పుడు సన్నద్ధమవుతోంది. కొంతమంది ఎంపిక చేసిన డీలర్లు ఇప్పుడు ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ఈ మిడిల్‌వెయిట్ నేకెడ్ బైక్ ఇటీవల ప్రారంభించిన ఆర్‌ఎస్ వెర్షన్ కంటే దిగువన ఉంది. రాబోయే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ అనలాగ్ టాకోమీటర్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ ముందు భాగంలో 41 మిమీ అప్‌సైడ్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనో-షాక్‌తో అమర్చబడి ఉంటుంది.

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

కొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ట్విన్ 310 మిమీ డిస్క్ బ్రేక్ ముందు భాగంలో మరియు 220 మిమీ డిస్క్ బ్రేక్ వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది డ్యూయెల్-ఛానల్ ఎబిఎస్ తో జత చేయబడింది.

MOST READ:బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో 765 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 12,000 ఆర్పిఎమ్ వద్ద 116 bhp శక్తిని మరియు 9,400 ఆర్పిఎమ్ వద్ద 77 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ కఠినమైన రూపాన్ని కలిగి ఉంది. 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌లో ఇంటిగ్రేటెడ్ ట్విన్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి.

MOST READ:పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

విడుదలకు సిద్దమైన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసిన వెంటనే ఇది కెటిఎం 790 డ్యూక్ బైక్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో మిడిల్‌వెయిట్ విభాగంలో బైక్‌లకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్‌ కూడా ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2020 Triumph Street Triple R Likely To Be Launched Next Week. Read in Telugu.
Story first published: Saturday, July 18, 2020, 12:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X