ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ లాంచ్ ఎప్పుడంటే.. ?
ట్రయంఫ్ ఇండియా 2020 మార్చి 25 న సరికొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులను కలిగి ఉంది. ఈ కొత్త ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

మునుపటి మోడల్‌తో పోలిస్తే 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ మరింత డిజైన్‌ను కలిగి ఉంది. రాబోయే ఈ కొత్త మోటార్ సైకిల్ ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి టెయిల్ లాంప్ కలిగి ఉంటుంది. బెల్లీ పాన్ మరియు టెయిల్ సెక్షన్ ప్యానెల్లు కూడా మోడిఫై చేయబడ్డాయి. అంతే కాకుండా పెద్ద టిఎఫ్‌టి స్క్రీన్, కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త గ్రాఫిక్స్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంటాయి.

2020 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ లో చేసిన అతిపెద్ద నవీకరణ ఇంజిన్. ఇది 765 సిసి లిక్విడ్-కూల్డ్ త్రీ సిలిండర్ల ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి వద్ద 11,750 ఆర్‌పిఎమ్ శక్తిని మరియు 9,350 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది మునుపటి మోడల్ యొక్క 77 ఎన్ఎమ్ కంటే 2 ఎన్ఎమ్ టార్క్ పెరుగుదల కనిపిస్తుంది. క్లచ్ లెస్ అప్ మరియు డౌన్‌షిఫ్ట్‌ల కోసం టూ-వే క్విక్-షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు ఇంజిన్ జతచేయబడి ఉంటుంది.

2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ పాత మోడల్ యొక్క ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విధులను బ్రెంబో ట్విన్ 310 ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు ముందు భాగంలో బ్రెంబో ఎం 50 మోనోబ్లోక్ కాలిపర్‌లతో మరియు వెనుకవైపు బ్రెంబో సింగిల్-పిస్టన్ కాలిపర్ సెటప్‌తో సింగిల్ 220 ఎంఎం డిస్క్ ఉంటాయి.

2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ ముందు భాగంలో 41 ఎంఎం షోవా అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక వైపున ఓహ్లిన్స్ ఎస్‌టిఎక్స్ 40 మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో పిరెల్లి సూపర్‌కోర్సా ఎస్పీ వి 3 టైర్లతో అమర్చబడి, హై-స్పీడ్ స్టెబిలిటీని అందిస్తుంది. అంతే కాకుండా స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్ లు కలిగి ఉంటాయి.

మునుపటి తరం ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ). భారతదేశంలో ఈ కొత్త తరం 2020 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర ఇంకా ప్రకటించలేదు. కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోటార్ సైకిల్ మార్చి 25 న ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇది మునుపటి మోడల్ కంటే చాల అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








