ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

బ్రిటన్‌కు చెందిన ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంప్. ఇది తన బ్రాండ్ నుంచి కొత్త వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ట్రయంఫ్ ప్రవేశపెట్టనున్న సరికొత్త బైకుల గురించి మరింత సమాచారం ఇప్పుడు మీకోసం..

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

ట్రయంఫ్ యొక్క కొత్త టైగర్ 900 బైక్ భారతదేశంలో ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ట్రయంఫ్ బ్రాండ్ యొక్క ఏ వేరియంట్ ని విడుదల చేస్తుందో ఇంకా తెలియరాలేదు. కాని టాప్-స్పెక్ జిటి ప్రో మరియు ర్యాలీ ప్రో వేరియంట్లు మరియు మిడ్-స్పెక్ ర్యాలీ వేరియంట్‌ను విడుదల చేయవచ్చని ఆశించవచ్చు. కొత్త టైగర్ 900 శ్రేణి మోటార్ సైకిల్స్ ధర 13 లక్షల నుండి 16 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

బైక్‌ను శక్తివంతం చేయడానికి కొత్త బిఎస్-6 కంప్లైంట్ 888 సిసి ఇన్ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఇది మునుపటి మోడల్లో 800 సిసి యూనిట్‌లో చూసినట్లుగా 1-2-3 కు బదులుగా 1-3-2 ఫైరింగ్ వంటి కొత్త ఆర్డర్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఇంజిన్ 95 పిఎస్ శక్తిని కలిగి ఉండటమే కాకుండా 87 ఎన్ఎమ్ టార్క్ ని కలిగి ఉంటుంది.

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

ట్రయంఫ్ యొక్క అండర్ పిన్నింగ్ పరంగా చూసినప్పుడు జిటి మరియు ర్యాలీ ప్రో శ్రేణి మధ్య కొన్ని ప్రధాన తేడాలు కనిపిస్తాయి. జిటి బైకులపై, మార్జోచి సస్పెన్షన్ యూనిట్లు పనిచేస్తుండగా, ర్యాలీ వెర్షన్లకు షోవా సస్పెన్షన్ యూనిట్లు లభిస్తాయి. బ్రేకింగ్ హార్డ్‌వేర్ బ్రెంబో స్టైల్మా కాలిపర్‌లను కలిగి ఉంటుంది, ఇది డుకాటీ పానిగలే వి 4 లో ప్రారంభమైంది.

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

ట్రయంఫ్ కొత్త బైకులో ఆరు రైడర్ మోడ్‌లు ఉంటాయి. అవి వరుసగా రెయిన్, రోడ్, స్పోర్ట్, రైడర్, ఆఫ్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ప్రో. కొత్త ట్రయంఫ్ కొత్త నవీనీకరణలను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, టైల్లైట్స్, టార్క్-అసిస్టెడ్ క్లచ్, హీటెడ్ గ్రిప్స్ వంటివి చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటాయి. ఇది మరిన్ని మంచి ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

ట్రయంఫ్ టైగర్ 900 బైక్ భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలుసా..!

ఏప్రిల్ లో విడుదల కాకానున్న టైగర్ 900 మోటార్ సైకిల్స్, 800 సిసి మోడళ్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందని మేము భావిస్తున్నాము. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పటికి అందుబాటులో లేదు. కానీ త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2020, 11:45 [IST]
English summary
Triumph’s All-new Tiger 900 Is Coming To India In April. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+