బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త బిఎస్ 6 అపాచీ ఆర్ఆర్ 310 ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిఎస్ 6 ప్రారంభ ధర రూ. 2.40 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) తో అందించబడుతుంది.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

ఆర్ఆర్ 310 లో కొత్త ఫీచర్స్ మరియు కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ వంటివి ఉంటాయి. టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ఇప్పుడు రెండు కలర్స్ లో లభిస్తుంది. ఒకటి రేసింగ్ రెడ్ మరొకటి టైటానియం బ్లాక్. ఇందులో స్మార్ట్ టెక్నాలజీతో పాటు 5 అంగుళాల టిఎఫ్‌టి కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

ఈ టివిఎస్ మోటార్ సైకిల్ రెయిన్, అర్బన్, స్పోర్ట్ మరియు ట్రాక్ అనే నాలుగు రైడింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. 2020 అపాచీ 310 లో థొరెటల్-బై-వైర్, బ్లూటూత్ కనెక్టివిటీ, గ్లైడ్ త్రూ టెక్నాలజీ ప్లస్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో డే / నైట్ మోడ్‌లు మరియు టివిఎస్ కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి కూడా ఉంటాయి.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మునుపటి మోడల్ లోని కొన్ని లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్ఈడి ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వంటి ఇతర ఫీచర్స్.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 లో అదే 312 సిసి సింగిలి సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కొంత నవీనీనీకరించబడింది. ఇది 33 బిహెచ్‌పి శక్తీ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 కోసం బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి, డెలివరీలు ఫిబ్రవరి రెండవ వారం నుండి ప్రారంభమవుతాయి.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

టివిఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ హెడ్ మేఘశ్యామ్ దిఘోల్ మాట్లాడుతూ, సూపర్ ప్రీమియం మోటారుసైకిల్ ఔత్సాహికులకు చాలా ఇష్టమైనది. ఇది ఇప్పుడు అల్టిమేట్ ట్రాక్ మెషీన్ గా పరిగణించబడుతుంది. అపాచీ ఇది 2017 లో ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ విధంగా ఉండటం వల్లె బిఎస్-6 వాహనం లాంచ్ అవ్వడానికి దోహదం చేసింది.

బిఎస్-6 అపాచీ ఆర్ఆర్ 310 ని లాంచ్ చేసిన టివిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 చాలా కొత్త నవీనీకరణలతో అప్డేట్ చేయబడింది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కూడా ఉంటుంది. 2020 అపాచీ ఆర్ఆర్ 310 మార్కెట్లో యమహా ఆర్ 3 మరియు కెటిఎం ఆర్‌సి 390 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2020, 11:30 [IST]
English summary
2020 TVS Apache RR310 BS6 Launched In India: Prices Start At Rs 2.40 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+