భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్

నేడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క డిమాండ్ రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఈ క్రమంలో చాలా ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడంలో నిమగ్నమైన ఉన్నాయి. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగం ద్వారా పర్యావరణ సమతుల్యత కూడా ఏర్పడుతుంది. అంతే కాకుండా క్రమంగా క్షీణిస్తున్న మన సహజ వనరులను (పెట్రోల్ & డీజిల్) ఆదా చేస్తాయి.

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

పూణేకు చెందిన స్టార్టప్ నెక్జు మొబిలిటీ, గతంలో అవన్ మోటార్స్ అని పిలిచేవారు, ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నారు. ఇండియన్ ఆటోబ్లాగ్ ప్రకారం ఈ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటారుసైకిల్స్ ని ప్రారంభించాలని యోచిస్తోంది. అంతే కాకుండా ఈ సంస్థకు ఇప్పుడు దేశవ్యాప్తంగా 70 డీలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి.

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

నెక్జు మొబిలిటీ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ, మేము ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నాము, కాని మా మోటారుసైకిల్ ఉత్పత్తి భారతదేశంలో ఎప్పుడు ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేము. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్ల ఉత్పత్తులు ఉంటాయి అన్నారు. ఈ కరోనా వైరస్ కారణంగా ఇవన్నీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

MOST READ:లారా దత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ నడపడం చూసారా ?

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

కంపెనీ సామర్థ్యము ప్రకారం నెలకు సుమారు 2,000 స్కూటర్ల ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగినప్పుడు ఇంకా అత్యధికంగా ఉత్పత్తి చేయగల సౌలభ్యం కూడా ఉంది. అంటే వీటిని సాధారణ స్థాయి కంటే కూడా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ చేసుకునే అవకాశం కూడా ఉంది.

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

ప్రస్తుతం నెక్జు మొబిలిటీలో మూడు ఎలక్ట్రిక్ -హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి. ఇవి దాదాపు 80 శాతం స్థానికంగా తయారవుతున్నాయి. మొదటిది నెక్జు రోడ్‌లార్క్. ఇది పెడల్ మోడ్‌లో 65 కిలోమీటర్లు మరియు థొరెటల్ మోడ్‌లో 55 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

అంతే కాకుండా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌కు శక్తినివ్వడానికి 5.2-Ah మరియు 8.8-Ah జంట బ్యాటరీలు యూనిట్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ -సైకిల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటుంది.

MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

రెండవది, ఎల్లో పెడల్ మోడ్‌లో 45 కిలోమీటర్లు మరియు థొరెటల్ మోడ్‌లో 38 కిలోమీటర్ల పరిధిని పొందుతుంది. ఇది ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌తో 8.8-Ah బ్యాటరీతో పనిచేస్తుంది. ఇక మూడవది రోంపస్, 5.2-ఆహ్ బ్యాటరీతో, పెడల్ మోడ్‌లో 25 కిలోమీటర్లు మరియు థొరెటల్ మోడ్‌లో 20 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది.

భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం..!

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తయారీదారులు కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతున్నారు. నెక్జు మొబిలిటీ ప్రస్తుతం అందించే ఉత్పత్తిని ప్రజలు ఇష్టపడతారు మరియు ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ప్రవేశపెట్టడంతో కంపెనీ ఖచ్చితంగా అమ్మకాల పెరుగుదలను ఆశించవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎక్కువ ఇంధనాల అవసరం ఉండదు. కాబట్టి కర్బనాలు వాతావరణంలోకి వెలువడే అవకాశం లేదు కాబట్టి వాతావరణ కాలుష్యం దాదాపుగా తగ్గిచవచ్చు. రాబోయే కళలమో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే ఉండే అవకాశం ఉంది.

MOST READ:బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు

Most Read Articles

English summary
Nexzu Mobility Is Likely To Launch An Electric Motorcycle Soon In India. Read in Telugu.
Story first published: Monday, April 27, 2020, 11:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X