బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రోజురోజుకీ పోటీ పెరిగిపోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిత్యం కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సెగ్మెంట్‌పై కన్నేసింది జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్. నిస్సాన్ తమ సరికొత్త బి-ఎస్‌యూవీ కాన్సెప్ట్ వరల్డ్ ప్రీమియర్‌ను జూలై 16, 2020న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ గ్లోబల్ మార్కెట్లలోనే కాకుండా భారత మార్కెట్‌లో కూడా ప్రవేశించనుంది.

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వాస్తవానికి ఈ కొత్త నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2020 ఆగస్ట్ నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, ప్రపచం వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన సంక్షోభం కారణంగా, మన దేశంలో నిస్సాన్ బి-ఎస్‌యూవీ రాక 2021కి వాయిదా పడింది.

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

నిస్సాన్ ఇప్పటికే తమ బి-ఎస్‌యూవీ కాన్సెప్ట్ మోడల్‌కి సంబంధించి అనే అనేక టీజర్లను కూడా విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలయ్యే ఈ కారును ‘మాగ్నైట్' అని పిలువనున్నారు. దేశీయ విపణిలో అత్యంత పోటీతో నిండిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రాబోయే కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

MOST READ:ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ నెల ప్రారంభంలో, నిస్సాన్ తమ ఫ్యూచర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి తొలి టీజర్ చిత్రాలను విడుదల చేసింది. టీజర్ చిత్రాలను బట్టి గమనిస్తే. సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ గ్రిల్ మరియు స్టైలిష్‌గా రూపొందించిన అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

నిస్సాన్ నుంచి వస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రాండ్ యొక్క గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఉంటుందని నిస్సాన్ గతంలో పేర్కొంది. ఈ ఎస్‌యూవీని బ్రాండ్ యొక్క గ్లోబల్ హెరిటేజ్ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయనున్నారు. నిస్సాన్ పాట్రోల్, కష్కాయ్, కిక్స్, జ్యూక్ మరియు పాత్‌ఫైండర్ వంటి పెద్ద మరియు ప్రసిద్ధి చెందిన ఎస్‌యూవీల నుండి ప్రేరణ పొంది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

MOST READ:భారీగా పెరిగిన సైకిల్స్ అమ్మకాలు, ఎలానో తెలుసా ?

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఇంటీరియర్స్, ఫీచర్స్ లేదా స్పెసిఫికేషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, నిస్సాన్ ప్రస్తుత పోటీని దృష్టిలో ఉంచుకొని, ఈ మోడల్ కాంపిటీటర్లతో పోల్చుకుంటే చాలా ప్రీమియం క్యాబిన్ ఉండేలా, విశిష్టమైన ఫీచర్లతో ఈ మోడల్‌ను తీర్చిదిద్దనున్నారు.

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

భారత మార్కెట్‌కు వచ్చే నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇంజన్‌ను గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ ప్రదర్శనకు ఉంచింది. ఈ ఇంజన్ సుమారు 100 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉండే అవకాశం ఉంది.

MOST READ:కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

బ్రెజ్జా, వెన్యూ, నెక్సాన్ మోడళ్లకు పోటీగా నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కొత్త నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గ్లోబల్ ప్రీమియర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడనుంది. ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తామని కంపెనీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త మోడల్ ఇప్పటికే రెనాల్ట్ అభివృద్ధి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన రెనాల్స్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా ఉండొచ్చని తెలుస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కిగర్‌లో ఉపయోగించే అనేక భాగాలను ఈ కొత్త నిస్సాన్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించవచ్చని అంచనా.

Most Read Articles

English summary
nissan new compact suv global premiere date announced details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X