అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

సాధారణంగా హెల్మెట్ ధరించకపోతే ఎంతటి అనర్థాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు.

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

పశ్చిమ బెంగాల్‌లో ద్విచక్ర వాహన డ్రైవర్లు పెరుగుతున్న తరుణంలో అక్కడ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల దృష్ట్యా కోల్‌కతా పోలీసులు డిసెంబర్ 8 నుండి నగరంలో 'నో హెల్మెట్ నో ఫ్యూయల్' ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రచారం కింద, హెల్మెట్ ధరించని డ్రైవర్లకు పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధన 60 రోజులుగా అమలు చేయబడుతోంది.

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

నగరంలో రోజు రోజుకి హెల్మెట్ ధరించని వాహనదారులు ఎక్కువవుతున్నారు. అంతే కాకుండా డ్రైవర్లు హెల్మెట్ ధరించని కేసులు ఎక్కువవుతున్నాయని కోల్‌కతా పోలీసు కమిషనర్ అనుజ్ శర్మ తెలిపారు. బైక్ డ్రైవర్లు వారి వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదంలో ఇద్దరూ గాయపడే అవకాశం ఉంది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

ఇటువంటి కేసులలో అనేక ప్రాసిక్యూషన్లు ఉన్నప్పటికీ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం వల్ల అవాంఛనీయ సంఘటనలు / ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. మెరుగైన రహదారి పద్దతులను నిర్ధారించడానికి మరియు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించేవారిని నిరోధించడానికి, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

పెట్రోల్ స్టేషన్ వద్ద హెల్మెట్ లేకుండా ఏ ద్విచక్ర వాహన డ్రైవర్‌కి పెట్రోల్ ఇవ్వవద్దని పోలీసులు తమ పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్ స్టేషన్లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ విధంగా చేసినప్పుడైనా కొంతవరకు అయినా ఈ నియమాలను అనుసరించే అవకాశం ఉంది.

MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

బైక్ డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా, అతనికి పెట్రోల్ ఇవ్వకూడదని కూడా పెట్రోల్ స్టేషన్ వారికీ చెప్పబడింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ విధంగా ధరించినప్పుడే వారికీ పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ అందించబడుతుంది. ఈ విధానం బైక్ పై ప్రయాణించే ఇద్దరికీ కూడా చాల అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ తలకు పెద్దగా గాయాలు అయ్యే అవకాశం ఉండదు.

అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?

2016 లో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి "నో హెల్మెట్ నో పెట్రోల్" నిబంధనను అమలు చేశారు, వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో పెట్రోల్ పంపులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ అమ్మడాన్ని కూడా నిషేధించారు. ఏది ఏమైనా ఈ విధానం ఇప్పుడైనా ఖచ్చితంగా అమలవుతుందేమో వేచి చూడాలి.

MOST READ:ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

Most Read Articles

English summary
No Helmet No Fuel Rule Implemented In Kolkata. Read in Telugu.
Story first published: Saturday, December 5, 2020, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X