Just In
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 3 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా ?
సాధారణంగా హెల్మెట్ ధరించకపోతే ఎంతటి అనర్థాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు.

పశ్చిమ బెంగాల్లో ద్విచక్ర వాహన డ్రైవర్లు పెరుగుతున్న తరుణంలో అక్కడ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల దృష్ట్యా కోల్‌కతా పోలీసులు డిసెంబర్ 8 నుండి నగరంలో 'నో హెల్మెట్ నో ఫ్యూయల్' ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రచారం కింద, హెల్మెట్ ధరించని డ్రైవర్లకు పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధన 60 రోజులుగా అమలు చేయబడుతోంది.

నగరంలో రోజు రోజుకి హెల్మెట్ ధరించని వాహనదారులు ఎక్కువవుతున్నారు. అంతే కాకుండా డ్రైవర్లు హెల్మెట్ ధరించని కేసులు ఎక్కువవుతున్నాయని కోల్‌కతా పోలీసు కమిషనర్ అనుజ్ శర్మ తెలిపారు. బైక్ డ్రైవర్లు వారి వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదంలో ఇద్దరూ గాయపడే అవకాశం ఉంది.
MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఇటువంటి కేసులలో అనేక ప్రాసిక్యూషన్లు ఉన్నప్పటికీ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం వల్ల అవాంఛనీయ సంఘటనలు / ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. మెరుగైన రహదారి పద్దతులను నిర్ధారించడానికి మరియు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించేవారిని నిరోధించడానికి, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

పెట్రోల్ స్టేషన్ వద్ద హెల్మెట్ లేకుండా ఏ ద్విచక్ర వాహన డ్రైవర్‌కి పెట్రోల్ ఇవ్వవద్దని పోలీసులు తమ పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్ స్టేషన్లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ విధంగా చేసినప్పుడైనా కొంతవరకు అయినా ఈ నియమాలను అనుసరించే అవకాశం ఉంది.
MOST READ:డ్రీమ్ కార్లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

బైక్ డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా, అతనికి పెట్రోల్ ఇవ్వకూడదని కూడా పెట్రోల్ స్టేషన్ వారికీ చెప్పబడింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ విధంగా ధరించినప్పుడే వారికీ పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ అందించబడుతుంది. ఈ విధానం బైక్ పై ప్రయాణించే ఇద్దరికీ కూడా చాల అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ తలకు పెద్దగా గాయాలు అయ్యే అవకాశం ఉండదు.

2016 లో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి "నో హెల్మెట్ నో పెట్రోల్" నిబంధనను అమలు చేశారు, వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో పెట్రోల్ పంపులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ అమ్మడాన్ని కూడా నిషేధించారు. ఏది ఏమైనా ఈ విధానం ఇప్పుడైనా ఖచ్చితంగా అమలవుతుందేమో వేచి చూడాలి.
MOST READ:ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?