యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా తమ అధికారిక దుస్తులు (మర్చెండైస్) మరియు ఉపకరణాలను (యాక్ససరీస్) అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఇకపై తమ యమహా స్కూటర్ లేదా మోటారుసైకిల్ కోసం యాక్ససరీస్ కొనాలని చూసే వినియోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌లో వాటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

యమహా భారతదేశంలో విక్రయించే వివిధ రైడింగ్ గేర్‌లను కూడా అమేజాన్ జాబితాలో చేర్చింది. వీటిని వినియోగదారులు మరియు అభిమానులు వారి ఇంటి వద్ద నుండే సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆర్డర్ చేసిన ఉత్పత్తులు అమెజాన్ ఇండియా ద్వారా సులభంగా మరియు సౌకర్యవంతంగా కస్టమరే ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి.

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

యమహా మోటారుసైకిల్ శ్రేణికి సంబంధించిన యాక్ససరీస్ జాబితాలో బైక్ కవర్, సీట్ కవర్, ట్యాంక్ ప్యాడ్, సీట్ కవర్, స్టిక్కర్ కిట్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, స్కూటర్ శ్రేణికి ఉపకరణాలలో కూల్ మెష్ సీట్ కవర్లు, స్టాండర్డ్ సీట్ కవర్ మరియు రెండు రకాల ఫ్లోర్ మ్యాట్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

దుస్తులు విభాగానికి వస్తే, యమహా భారత మార్కెట్లో విక్రయించే సమగ్రమైన రైడింగ్ గేర్‌లను అమేజాన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 14 రకాల హెల్మెట్లు కూడా ఉన్నాయి. వీటిలో ఫుల్ ఫేస్ మరియు హాఫ్ ఫేస్ హెల్మెట్ మోడళ్లు ఉన్నాయి.

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

ఇతర రైడింగ్ గేర్ లైనప్‌లో డ్యూయెల్ కలర్ స్కీమ్‌లలో రైడింగ్ జాకెట్లు, రైడింగ్ గ్లౌవ్, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ బ్లూ కలర్ స్కీమ్‌తో యమహా క్యాప్, టీ-షర్ట్ మరియు పోలో షర్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వివిధ పరిమాణాలలో సైజుల వారీగా లభిస్తాయి.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మోటోఫుమి శితారా మాట్లాడుతూ, "భారత మార్కెట్లో మా ఆన్‌లైన్ ఉనికిని బలోపేతం చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము మరియు ఆ దిశగా మా అభిమానులకు మరింత చేరువయ్యే లక్ష్యంలా భాగంగా అమేజాన్‌లో ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాము. ఇటీవలే మేము "వెహికల్ ఆన్‌లైన్ సేల్స్"ను కూడా ప్రారంభించాము, ఇది ఆన్‌లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది" అని అన్నారు.

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

"వినియోగదారుల కోసం యమహా ఇప్పుడు ఆకర్షణీయమైన రైడింగ్ దుస్తులు మరియు యాక్ససరీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా, యమహా బ్రాండ్‌తో ఇంకా ఎటువంటి సంబంధాలు లేని కస్టమర్లను సైతం చేరుకోగలుగుతుంది. తద్వారా బ్రాండ్ పరిమాణం మరింత విస్తరించి, ఎక్కువ కస్టమర్లను యమహా బ్రాండ్‌కు చేరువయ్యేలా చేస్తుందని" ఆయన చెప్పారు.

MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్‌లో అఫీషియల్ యాక్ససరీస్

అమేజాన్‌లో యమహా యాక్ససరీస్ విక్రయంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ కంపెనీల్లో ఒకటైన అమేజాన్‌తో యమహా చేతులు కలపడం నిజంగా విశేషం. యమహా అందించే రైడింగ్ గేర్లు మరియు దుస్తులు కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఇకపై యమహా షోరూమ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్లు నేరుగా తమ ఇంటి వద్ద కూర్చునే ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన యమహా యాక్ససరీలను కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Motor India has launched its apparel and accessories on the Amazon India website. Customers looking to purchase accessories for their Yamaha scooter or motorcycle can do it on the Amazon website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X